వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక విశాఖ అందాలు హెలికాఫ్టర్ లోనుంచి...ఈ నెల 16 న సిఎం చే హెలీ టూరిజం ప్రారంభం

|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం: పర్యాటక ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హెలీటూరిజం కల కొద్ది రోజుల్లోనే సాకారం కాబోతుంది. ఈ నెల 16 ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా హెలీ టూరిజంను ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నట్లు వుడా అధికారులు చెబుతున్నారు.

Recommended Video

Krishna river boat capsized : సింగపూర్‌ టూరిజం కాదు, సేఫ్టీ టూరిజం కావాలి | Oneindia Telugu

మంగళవారం వుడా కార్యాలయంలో వుడా విసి బసంత్ కుమార్ మీడియా సమావేశంలో హెలీ టూరిజం ప్రారంభ వివరాలు వెల్లడించారు. రాష్ట్రపతి విశాఖ పర్యటన నాటి నుంచే విశాఖలో హెలిటూరిజం ప్రారంభించాలనుకున్నామని ,అయితే అవసరమైన అనుమతుల్లో కొన్ని రానందున అలా జరగలేదన్నారు.

 డిసెంబర్ 16 న...

డిసెంబర్ 16 న...

ఈనెల 16 వ తేదీ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా హెలీ టూరిజం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వుడా విసి బసంత్ కుమార్ వెల్లడించారు.ప్రారంభం రోజున డబుల్ ఇంజన్ హెలికాఫ్టర్ ను తెప్పిస్తామన్నారు.

 ఎప్పటివరకు...

ఎప్పటివరకు...

డిసెంబర్ 16 నుంచి జనవరి 15 వరకు హెలికాఫ్టర్ ను తిప్పుకునేందుకు ప్లాగ అధికారులను అనుమతికోరామన్నారు. ఆ తరువాత ఆ అనుమతిను పొడిగించుకుంటూ ప్రయోగాత్మకంగా మూడు నెలల పాటు హెలికాఫ్టర్ లో పర్యటక స్థలాల సందర్శన ప్రాజెక్టు కొనసాగిస్తామని విసి చెప్పారు. ఆ తరువాత సందర్శకుల ఆదరణ ను బట్టి ప్రాజెక్టు కొనసాగించాలా లేదా అనేది నిర్ణయిస్తామన్నారు.

 శాశ్వత ఒప్పదం...

శాశ్వత ఒప్పదం...

సందర్శకుల నుంచి హెలీ టూరిజానికి మంచి స్పందన లభించినట్లయితే ఈ ప్రాజెక్టు శాశ్వతంగా కొనసాగుతుందని చెప్పారు. పర్యాటకుల ఆదరణను బట్టి అంచనా వేసుకొని శాశ్వతంగా హెలీకాఫ్టర్ ను తిప్పేందుకు సంబంధిత సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరుగుతుందని వుడా విసి వివరించారు.

 సంస్థల ఆసక్తి....

సంస్థల ఆసక్తి....

హెలీ టూరిజం ప్రారంభం పవన్ హెన్స్ సంస్థ కు సంబంధించిన హెలీకాఫ్టర్ తో ప్రాజెక్టు ఓపెన్ అవుతుందన్నారు. విశాఖలో తమ హెలికాఫ్టర్లను తిప్పేందుకు పవన్ హెన్స్ సంస్థతో పాటు పలు ప్రైవేట్ ఆపరేటర్లు ఆసక్తి చూపుతున్నారని బసంత్ వెల్లడించారు.

హెలీ పోర్టు ఎక్కడ...

హెలీ పోర్టు ఎక్కడ...

హెలీ పోర్టు ఏర్పాటు విషయమై మాట్లాడుతూ తొలుత హాట్ లైన్ ఛానల్ ద్వారా తాత్కాలికంగా నడిపిస్తామని, పర్యాటకుల ఆదరణను బట్టి పర్మినెంట్ హెలీ పోర్టు నిర్మాణం గురించి ఆలోచిస్తామన్నారు. ఈ పర్మినెంట్ హెలీ పోర్టు నిర్మాణం చెయ్యాల్సి వస్తే కైలాసగిరి, రుషికొండ, తొట్టకొండ ప్రాంతాలను పరిగణనలొకి తీసుకుంటామన్నారు.

 ఆర్థిక సహకారం...

ఆర్థిక సహకారం...

అయితే ఈ ప్రాజెక్టుకు వుడా అగ్నిమాపక, అంబులెన్స్ వంటి సౌకర్యాలే అందిస్తుందని వుడా విసి తెలిపారు. అంతే తప్ప వుడా నుంచి ఈ హెలీ టూరిజం ప్రాజెక్టుకు ఎలాంటి ఆర్థిక సహకారం ఉండదని స్పష్టం చేశారు.

 చిరుతల కలకలం పై...

చిరుతల కలకలం పై...

కైలాసగిరిలో చిరుతల సంచారం కలకలం గురించి వుడా విసి మాట్లాడుతూ అక్కడ ఏర్పాటు చేసిన నైట్ విజన్ కెమేరాల్లో ముళ్లపంది,కనుజు,
సాంబార్ డీర్ వంటివి కనిపించాయని, అయితే వాటిలో చిరుత సంచారం ఆనవాళ్లే లేవన్నారు. మరింత నిశితంగా పరిశీలించి రెండు మూడు రోజుల్లో పర్యటకులను అనుమతించే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

 హెలీటూరిజం ఎక్కడెక్కడ...

హెలీటూరిజం ఎక్కడెక్కడ...

మరోవైపు హెలీటూరిజం ప్రాజెక్టు ను విశాఖలతో పాటు విజయవాడ, తిరుపతిల్లో నడిపించాలని ఎపి టూరిజం శాఖ భావిస్తోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చురుగ్గా కొనసాగిస్తోంది.

English summary
visakhapatnam: Andhra Pradesh Tourism Department heli tourism initial service will be introduced in Visakhapatnam. VUDA organized meeting for the purposes of distributing information about heli tourism project opening date to the media. CM chandrababu naidu will inaugurate the heli tourism on december 16.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X