నందమూరి హీరో చేతిలో ఆ పార్టీ జెండా..షాక్‌లో అభిమానులు
గత కొంతకాలంగా నందమూరి కుటుంబంలో విభేదాలు చోటు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, బాలకృష్ణల మధ్య మనస్పర్థలు తలెత్తుతున్నాయని పలు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హరికృష్ణ మరణం తర్వాత , నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఒంటరయ్యారు.ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్ట్‌పై నందమూరి కుటుంబం అంతా స్పందించినప్పటికీ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు మాత్రం ఈ ఘటనపై రియాక్ట్ కాలేదు.
అప్పటి నుంచి నారా, నందమూరి కుటుంబాలు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లను దూరం పెడుతూ వస్తోంది. అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అవకాశం వచ్చినప్పుడల్లా ఈ రెండు కుటుంబాలు చెబుతూనే ఉన్నాయి. తాజాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ టీడీపీ జెండాను పట్టుకోవడం సినీ , రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకున్న సంఘటన నరసరావుపేటలో జరిగింది. కళ్యాణ్ రామ్ నరసరావుపేటకు వచ్చినప్పుడు, నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

నరసరావుపేటలో చాలా చోట్ల భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. "నందమూరి యువసేన" అనే అభిమానుల సంఘం కళ్యాణ్ రామ్ రాకను పురస్కరించుకుని పోస్టర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.ఈ ఫ్లెక్సీలలో జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణలతో కలిసి ఉన్న కళ్యాణ్ రామ్ ఫోటోలు కనిపించాయి. కళ్యాణ్ రామ్ నారా లోకేష్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల ఫొటోలు ఉన్న తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకుని ప్రదర్శించారు.
తెలుగుదేశం జెండా తో నందమూరి కళ్యాణ్ రామ్ | #NandamuriKalyanRam #NTR #TeluguDesamParty #Teluguoneindia #Oneindiatelugu pic.twitter.com/QTUOTwgcYH
— oneindiatelugu (@oneindiatelugu) March 31, 2025
ఈ సంఘటన నందమూరి కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని, అందరూ ఐక్యంగా ఉన్నారని తెలియజేసింది. కొంతకాలంగా నందమూరి కుటుంబంలో హరికృష్ణ కుమారులైన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లకు తెలుగుదేశం పార్టీ నాయకులతో విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలు నిజం కాదని ఈ సంఘటనతో తేలిపోయింది. నారా లోకేష్ కూడా ఇంతకు ముందు నందమూరి కుటుంబంతో తమకు ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఇటీవల లోకేష్ సైతం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని తన చేతితో పట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు. దీంతో వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేదని స్పష్టం అయింది.












Click it and Unblock the Notifications