జగన్ తో భేటీకి దూరంగా నాగ్ - తారక్ : లాస్ట్ మినిట్ లో ఏం జరిగింది : చిరంజీవి లౌక్యంగా..!!

సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు. గతంలోనే సినీ సమస్యలపైన చర్చించిన చిరంజీవి..ఇప్పుడు ఒక్కరుగా కాకుండా.. ఇండస్ట్రీలోని ఇతరులతో కలిసి వచ్చారు. అందులో వచ్చిన హీరోలను సీఎం సూచించారా.. లేక, చిరంజీవి ఎంపిక చేసారా అనే చర్చ సాగుతోంది. సీఎంతో సమావేశమైన వారిలో చిరంజీవి..మహేష్ బాబు..ప్రభాస్.. రాజమౌళి..కొరటాల శివ..ఆలీ..పోసాని ఉన్నారు. పలు అంశాల పైన వారు ఒక వినతి పత్రం అందచేసారు. అయితే, ఈ సమావేశానికి చిరంజీవి - జగన్ ఉమ్మడి స్నేహితుడు అయిన హీరో నాగార్జున హాజరు కాలేదు.

నాగ్ - తారక్ డ్రాప్ అవ్వటం వెనుక

నాగ్ - తారక్ డ్రాప్ అవ్వటం వెనుక

సీఎంతో సమావేశమయ్యే వారి జాబితాలో నాగార్జునతో పాటుగా హీరో జూనియర్ ఎణ్టీఆర్ పేరు ఉంది. కానీ, వీరిద్దరూ చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు. చిరంజీవి - నాగార్జున తొలి నుంచి జగన్ పట్ల సానుకూల ధోరణితో ఉన్నారు. కొద్ది నెలల క్రితం నాగార్జున ఒక్కరే అమరావతి వచ్చారు. సీఎం జగన్ తో లంచ్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఆ తరువాత తాను వ్యక్తిగత అంశాలపైనే కలిసినట్లుగా చెప్పుకొచ్చారు. ఇక..చిరంజీవి సీఎంను కలిసిన సమయంలోనూ సినిమా పరిశ్రమ గురించే చర్చిస్తున్నారని..పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. ఇక, ఈ రోజు సమావేశానికి చివరి నిమిషంలో నాగార్జున ఆగిపోయినట్లుగా సమాచారం. అక్కినేని అమలకు కరోనా పాజిటివ్‌ రావడంతో నాగార్జున హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కారణంగానే సీఎం వైఎస్‌ జగన్‌తో జరిగే భేటీకి నాగార్జున దూరంగా ఉన్నట్లు సమాచారం.

జూనియర్ అందుకే దరంగా ఉన్నారా

జూనియర్ అందుకే దరంగా ఉన్నారా

మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ ను సైతం చర్చలకు వచ్చే విధంగా మంతనాలు సాగినట్లు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ నుంచి ఈ ఉదయం బయల్దేరే సమయంలో చిరంజీవి తనకు సీఎం నుంచి ఆహ్వానం అందిందని..మిగిలిన వారు ఎవరు వస్తున్నారో తనకు తెలియదంటూ కామెంట్ చేసారు. దీని ద్వారా చర్చల్లో పాల్గొనే వారి ఎంపిక విషయంలో తన ప్రమేయం లేదనే విధంగా లౌక్యంగా వ్యవహరించే ప్రయత్నం చేసారు. కానీ, అందరూ ఒకే ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. ఇక, చెప్పిన విధంగానే మహేష్ బాబు.. ప్రభాస్ రాగా, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాలేదు. తారక్ చివరి నిమిషం లో ఆగిపోవటం వెనుక వ్యక్తిగత కారణాలు అని చెబుతున్నా... రాజకీయంగా విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుందనే దూరంగా ఉన్నారనే ప్రచారం ఇండస్ట్రీలో సాగుతోంది.

చివరి నిమిషంలో నిర్ణయం మార్పు

చివరి నిమిషంలో నిర్ణయం మార్పు

నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య సైతం చర్చలకు దూరంగా ఉన్నారు. బాలయ్య సైతం చర్చలకు వచ్చేలా చిరంజీవి ప్రయత్నాలు చేసారనే ప్రచారం టాలీవుడ్ సర్కిల్స్ లో ఉంది . కానీ, బాలయ్య రాకుండా.. తాను మాత్రం వెళ్తే.. సహజంగానే టీడీపీ శ్రేణుల నుంచి రాజకీయంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయంతోనే తారక్ చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారని చెబుతున్నారు. కొద్ది నెలల క్రితం ఏపీ అసెంబ్లీ వేదికగా చోటు చేసుకున్న పరిణామాలు.. జూనియర్ ఎన్టీఆర్ స్పందన.. టీడీపీ నేతల వ్యాఖ్యలతో టీడీపీ కార్యకర్తలు కొందరు జూ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసారు. తిరిగి మరోసారి ఎవరికీ విమర్శలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే జూనియర్ మొత్తంగా సమావేశానికి దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

Recommended Video

    Analysis On Tollywood Stars ,Ys Jagan Meet ఆచార్య లేకపోతె తెగేది కాదు| Oneindia Telugu
    సీఎం జగన్ తో సమావేశంపై హ్యాపీ

    సీఎం జగన్ తో సమావేశంపై హ్యాపీ

    ఇక, సీఎంతో చర్చల తరువాత చిరంజీవి... మహేష్ బాబు..ప్రభాస్ అందరూ హర్షం వ్యక్తం చేసారు. అదే సమయంలో సీఎం జగన్ కోరిన విధంగా ఏపీలోనూ సినిమా పరిశ్రమ విస్తరణకు ముందుకొచ్చేందుకు చిరంజీవి సహా హీరోలు సుముఖత వ్యక్తం చేసారు. విశాఖ కేంద్రంగా సినీ ఇండస్ట్రీని డెవలప్ చేసేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం సైతం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలనుకున్నా అందించటానికి సిద్దంగా ఉన్నామని స్పష్టం చేసారు. ఇక, పరిశ్రమ కోరుకుంటున్న విధంగా అన్ని అంశాలకు పరిష్కారం చూపుతూ.. ఈ నెల మూడో వారంలో ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లుగా హీరోలు చెప్పుకొచ్చారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+