భక్తులపై కేసు: హీరో శివాజీ ఆందోళన, ఆగ్రహం(పిక్చర్స్)

హైదరాబాద్/చిత్తూరు: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల పైన కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ ప్రముఖ సినీ హీరో శివాజీ గురువారం రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లిబర్టీ వద్ద గల టిటిడి కల్యాణ మండపం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

భక్తుల పైన పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన వారిపై కేసులు పెట్టడమేమిటని ప్రశ్నించారు. సామాన్య భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రశాంత వాతావరణం కల్పించాలన్నారు. టిటిడి స్వప్రయోజనాలను పక్కన పెట్టాలని హితవు పలికారు.

కేసులు ఉపసంహరించుకోవాలి: కిషన్ రెడ్డి

తిరుమలలో భక్తులపై కేసులు పెట్టడాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. విఐపి టిక్కెట్లు అమ్ముకున్న వారి పైన కేసులు పెట్టాలన్నారు. భక్తులపై కేసులకు సంబంధించి ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ జరిపించాలన్నారు. కేసులకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

శివాజీ 1

శివాజీ 1

శ్రీవారి భక్తులను అరెస్టు చేయడం తనను కలచి వేసిందని సినీ నటుడు శివాజీ అన్నారు. రాజకీయ నాయకుడుకూడా సామాన్య భక్తుడిగానే ఫీల్ అవ్వాలని హితవు పలికారు.

శివాజీ 2

శివాజీ 2

తొమ్మిది వేల పాసులు తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చిందంటే అది సరికాదని, కొండ మీద రాజకీయాలు చేసే వారిని అదుపులోకి తీసుకోవాలని శివాజీ అన్నారు.

శివాజీ 3

శివాజీ 3

తిరుమల కొండ పైన ఏమైనా ఎమర్జెన్సీ పెట్టారా అని ప్రశ్నించారు. ప్రపంచంలో మీడియా అనే కన్ను ఉందని, అదే భగవంతుడు అనుకోవాలన్నారు.

శివాజీ 4

శివాజీ 4

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఏం కావాలో చూడాలన్నారు. ఏ సమస్య పైన అయినా స్పందించేందుకు మీడియా ఉందని, భగవంతుడు మీడియా రూపంలో అన్నింటి పైనా దృష్టి సారించేందుకు వచ్చాడన్నారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన టిటిడి తీరును తప్పు పట్టారు. తిరుమలలో భక్తులపై కేసులు పెట్టడాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

కేసులపై కనుమరి

భక్తులపై కేసు విషయం ఈవోతో చర్చిస్తానని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు వేరుగా చెప్పారు. భక్తులపై కేసులు దురదృష్టకరమన్నారు. భక్తులు కూడా ఆందోళన చేయడం మంచి పద్ధతి కాదన్నారు.

చట్టం ప్రకారమే..

టిటిడి చట్టం ప్రకారమే ఆందోళన చేసిన భక్తుల పైన కేసులు నమోదు చేసినట్లు టిటిడి ముఖ్య భద్రతాధికారి తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజు ధర్నా చేసిన భక్తులపై కేసులు పెట్టారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాగా, భక్తులపై కేసులను ఉపసంహరించుకోవాలని బిజెపి వినతి పత్రం ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+