వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేవీపీ బిల్లు: భగ్గుమన్న హీరో శివాజీ, టిడిపి-బిజెపిలది తిరగబడింది!

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్ర రావు ప్రవేశపెట్టిన బిల్లు చర్చకు, ఓటింగుకు రాకపోవడంతో నటుడు శివాజీ టిడిపి, బిజెపిల పైన శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని వ్యాఖ్యానించారు.

రాజ్యసభలో జరిగిన దానిని ప్రజలు అంతా చూస్తున్నారన్నారు. కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి ఏపీ ప్రయోజనాల కంటే కేంద్ర ప్రయోజనాలు పట్టించుకోవడం దురదృష్టకరమన్నారు. సోమవారం బిల్లును కాంగ్రెస్, టిడిపిలు కలిసి ప్రవేశ పెట్టాలని సూచించారు.

ఏపీకి ప్రత్యేక హోదా బిల్లును 14వ బిల్లుగా ప్రవేశ పెట్టి దానిని తొక్కేద్దామని చూశారన్నారు. చేసిన తప్పును తెలుసుకొని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు కాంగ్రెస్ పట్టుబడితే దానిని తప్పుపట్టడం సరికాదన్నారు. ప్రజలకు ఏం తెలియదని, తాము ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందనుకుంటే అది సరికాదన్నారు.

వీడియోతో బీజేపీ వ్యూహం: ఉండవల్లి, టిడిపి రివర్స్వీడియోతో బీజేపీ వ్యూహం: ఉండవల్లి, టిడిపి రివర్స్

Hero Shivaji takes on Ruling parties, Now, it’s BJP versus TDP

సుజనా చౌదరి బీజేపీలో చేరితే బాగుండునని ఎద్దేవా చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ దోషిగా మిగిలిందన్నారు. బిల్లుల వరుస క్రమం మారితే వచ్చిన నష్టం ఏమిటో చెప్పాలన్నారు. కేంద్రానికి అవసరమైన బిల్లులు ముందు, ప్రజలకు అవసరమైనవి తర్వాత ఓటింగుకు పెట్టడం ఎందుకని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారన్న సంగతి గుర్తుంచుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సుజనా చౌదరి బీజేపీలో చేరి ఉంటే బాగుండేదని ఆయన పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ దోషిగా నిలబడిందని ఆయన చెప్పారు. బిల్లుల వరుస క్రమం మారితే వచ్చిన నష్టం ఏంటని? ఆయన నిలదీశారు. కేంద్రానికి అవసరమైన బిల్లులు ముందు, ప్రజలకు అవసరమైన బిల్లులు తరువాత ఓటింగ్ కు పెట్టాల్సిన అవసరం ఏంటని ఆయన నిలదీశారు.

టిడిపి వర్సెస్ బిజెపి అనుకుంటే...

కేవీపీ బిల్లు నేపథ్యంలో రాజ్యసభలో టిడిపి - బిజెపి మధ్య విభేదాలు పొడసూపే అవకాశాలు లేకపోలేదని చాలామంది భావించారు. కేవీపీ బిల్లుకు టిడిపి మద్దతివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మద్దతిస్తామని ప్రకటన కూడా చేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బిజెపి - టిడిపి మధ్య సంబందాలు అంత బాగా లేవు.

ఏఏపీ ఎంపీ వీడియో రగడ, కేవీపీ బిల్లుపై సస్పెన్స్: అదే దారిలో జగన్ఏఏపీ ఎంపీ వీడియో రగడ, కేవీపీ బిల్లుపై సస్పెన్స్: అదే దారిలో జగన్

ఇప్పుడు ఆ బిల్లుకు టిడిపి మద్దతిస్తే మరింత దూరం పెరగవచ్చుననే ఊహాగానాలు వినిపించాయి. కానీ, శుక్రవారం నాడు బిల్లు చర్చ, ఓటింగుకు రాలేదు. దీనిపై కాంగ్రెస్ నేతలు కేంద్రంపై దుమ్మెత్తి పోశారు. కానీ టీడీపీ నేతలు మాత్రం కమలం పార్టీకి అండగా నిలబడ్డారు.

అసలు, కాంగ్రెస్ పార్టీ అరగంట ఓపిక పడితే బిల్లు చర్చకు వచ్చేదని సుజనా చౌదరి పాయింట్ లాగారు. తద్వారా బీజేపీకి అండగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీ పైన నెపం వేశారు. దీంతో, టిడిపి - బిజెపి మధ్య ఈ బిల్లు చిచ్చు పెడుతుందని భావించిన వాళ్లకు, సుజనా, బీజేపీ నేతలు ఝలక్ ఇచ్చారని చెప్పవచ్చు.

English summary
Hero Shivaji takes on Ruling parties, Now, it’s BJP versus TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X