విజయవాడలో బాంబు కలకలం.. బీసెంట్ రోడ్డులో బాంబ్ స్క్వాడ్ !
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో బాంబు కలకలం నెలకొంది. స్థానిక బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసీ భవనంలో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయడం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు.. అప్రమత్తమై బాంబ్ స్క్వాడ్ ను సంఘటన స్థలానికి రప్పించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దీంతో బెజవాడ వాసుల్లో టెన్షన్ మొదలైంది.
దీంతో బీసెంట్ రోడ్డులోని దుకాణాలు, కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేయించారు. ట్రాఫిక్ ను సైతం మళ్లించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అలానే పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తిని సైతం ట్రేస్ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇటీవల దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల రీత్యా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవలే జమ్మూ కశ్మీర్‌లోని పహల్లో ఉగ్రదాడి.. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టడం.. పాక్ తో యుద్ద వాతావరణం నెలకొనడం వంటి పరిస్థితుల్లో కొందరు కావాలనే ఇలా చేశారా ? లేక మరేదైనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు విజయనగరంలో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో సిరాజ్ ఉర్ రెహ్మాన్ (29), సయ్యద్ సమీర్ (28)లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ హైదరాబాద్‌లో పేలుళ్లకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సిరాజ్, సమీర్‌లను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుని విచారణ ముమ్మరం చేసింది. వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా పరిచయమై, ఉగ్రవాద భావజాలంతో ప్రభావితమయ్యారు. సౌదీ అరేబియాలో ఉన్న హ్యాండ్లర్ మార్గదర్శకత్వంలో బాంబుల తయారీకి అవసరమైన పదార్థాలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి రంపచోడవరం అడవిలో డమ్మీ బ్లాస్ట్ నిర్వహించారు. ప్రస్తుతం ఈ కేసును NIA డీల్ చేస్తోండగా.. సిరాజ్ ఇంట్లో నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం వంటి పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications