కిరణ్‌పై చర్యలు: వీహెచ్, దేశభద్రతకే లేదు: ధూళిపాళ్ళ

రాష్ట్ర విభజన ప్రక్రియను కాంగ్రెస్ అధిష్టానం వేగంగా పూర్తి చేస్తోందని ఆయన అన్నారు. ఈ సమయంలో కిరణ్‌కుమార్ రెడ్డి సమైక్యవాదినని ప్రకటించడమేంటని వీహెచ్ మండిపడ్డారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కిరణ్‌కుమార్ రెడ్డిపై అధిష్టానం తగిన చర్య తీసుకుంటుందని ఆయన తెలిపారు. తెలంగాణలో తమ పార్టీ 15 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని వీహెచ్ ధీమా వ్యక్తం చేశారు.
దేశభద్రతకే భరోసా లేదు..సీమాంధ్రకేలా: ధూళిపాళ్ల
హైదరాబాద్: దేశ భద్రతకే భరోసా ఇవ్వని ప్రధాని మన్మోహన్ సింగ్, సీమాంధ్ర ప్రజలకు భరోసా ఇస్తామనడం హాస్యాస్పదమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మాట్లాడారు.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన పార్టీలు డిమాండ్ చేయడంతో శ్రీలంక పర్యటనను రద్దు చేసుకున్న ప్రధాని మన్మోహన్ సింగ్, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడాలని సీమాంధ్రలో ఉద్యమం జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన రాష్ట్ర ఎంపీలు ఇప్పుడు యాచించడం సిగ్గు చేటని నరేంద్ర అన్నారు.












Click it and Unblock the Notifications