వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోల‌వరం ప్రాజెక్టుపై వైఖరి తెలపండి: కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం...

పోల‌వ‌రం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేత కేవీపీ రామ‌చంద్ర‌రావు దాఖలు చేసిన పిటిష‌న్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర‌మే నిర్మించాల‌ని కోరుతూ కేవీపీ

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి: పోల‌వ‌రం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేత కేవీపీ రామ‌చంద్ర‌రావు దాఖలు చేసిన పిటిష‌న్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర‌మే నిర్మించాల‌ని కోరుతూ కేవీపీ తన పిటిష‌న్ లో కోరారు. దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు పోల‌వ‌రంపై మీ వైఖ‌రి ఏంటో తెల‌పాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి ఆదేశించింది.పోలవరవ నిర్మాణం వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు అయ్యే పూర్తి వ్యయాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కేంద్రమే భరించేలా, చట్టం ప్రకారం వ్యవహరించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కేవీపీ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి దానికి అయ్యే పూర్తి ఖర్చును కేంద్రమే భరించాల్సిన అవసరం ఎందుకు ఉందో కేవీపీ తన పిటిషన్ లో సోదాహరణంగా వివరించారని తెలిసింది. అలాగే ఈ ప్రాజెక్ట్ గురించి చంద్రబాబు చెబుతున్న మాటలు రాష్ట్ర ఖజానాపై పెను భారం పెంచేలా తయారవుతున్నాయని కేవీపీ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

high Court Accepts kvp petition On Polavaram Project

అయితే ఇప్పుడు ఈ పిటిషన్ పట్ల చంద్రబాబు స్పందన ఎలా ఉండబోతోందనే అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే పోలవరం విషయంలో ప్రతిపక్షాలు విమర్శించినప్పుడల్లా చంద్రబాబు వారిపై ఎదురుదాడికి దిగుతున్నారు. అలాంటి సందర్భాల్లో వీళ్లంతా ప్రగతి నిరోధకులు అనే వ్యాఖ్యలు చెయ్యడం చంద్రబాబుకు పరిపాటైపోయింది. అయితే ఇప్పడు పోలవరంపై కేవీపీ వేసిన పిల్ వల్ల అయితే గియితే రాష్ట్రానికి మంచే జరుగుతుందే తప్ప కీడు జరిగే అవకాశం ఏమాత్రమూ లేదు. మరి అలాంటప్పుడు నైతికంగా చంద్రబాబు ఈ పిటిషన్ ను స్వాగతించాలి. కాని చంద్రబాబు వైఖరి తెలిసిన వారెవరైనా ఆయన ఈ పిల్ ను సమర్థిస్తారని అస్సలు భావించక పోయినా కనీసం సహకరిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే భావనలో ఉన్నారు. ఎందుకంటే ఈ పిటిషన్ కు సంబంధించి రాష్ట ప్రభుత్వం కూడా ప్రతివాదిగా ఉన్నది కాబట్టి ప్రభుత్వం తరుపు వాదనలు వినిపించాల్సిన సందర్భాల్లో కేంద్రం బాధ్యత గురించి స్పష్టంగా వివరించాల్సి వుంటుంది. ఇక్కడే చంద్రబాబు వైఖరి కీలకం కానుంది.

పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిపై మెజారిటీ ప్రజల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ఈ ప్రాజెక్ట్ కు నిధుల పదే పదే మాట మారుస్తూ రాష్ట్రాన్ని మోసం చేస్తోందనే మాట చాలా మంది నుంచి వినిపిస్తోంది. అదీ ముఖ్యంగా గడచిన కొన్ని నెలలుగా పోలవరం పట్ల కేంద్రం ధోరణి చాలా భిన్నంగా కనిపిస్తోందని, దీనివల్ల చాలా నష్టం జరుగుతుందని పరిశీలకుల అంచనా. అయినప్పటికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం మాత్రం కనీసం ప్రతిస్పందన లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.

మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనులు సాగే విషయంలోగాని, తాను చెప్పిన మార్పుచేర్పుల్లో గాని ఏ ఒక్కదానికీ చంద్రబాబు కేంద్రం నుంచి అనుమతి సాధించుకోలేకపోయారనేది కళ్లముందు కనిపిస్తోంది. అలాగే నిధుల విడుదల విషయంలోనూ రకరకాల మాటలు మాట్లాడుతున్నప్పటికీ చంద్రబాబు కనీసం ఒక్క సందర్భం లోనూ ఏమీ ప్రశ్నించకుండా నిశ్శబ్దం పాటిస్తున్నారు. ఈ విషయంలో తాను మిత్రధర్మం పాటిస్తున్నాని చెప్పే చంద్రబాబు, మిత్రధర్మం కోసం రాష్ట్రం ప్రయోజనాలు దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకోవడం సరికాదంటున్నారు మెజారిటీ ప్రజలు. అందుకే రాష్ట్రానికి మేలు చేకూరేలా ఎవరైనా పోరాడుతుంటే కనీసం వాళ్లకు సహకరించడం భవిష్యత్తులో ఆయనకు ఉపకరిస్తుందనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. మరి పోలవరంపై కెవిపి పిటిషన్ విషయంలో

English summary
In his petition, KVP said that the efforts of AP to divide the Polavaram construction work and hand over some portion to new contractors was rejected by the Centre on grounds of price escalation, adding that the price escalation too should be borne by the Centre.AP is keeping quiet and for reasons best known to it, has decided to bear the escalated costs on its own without questioning the Centre, the Congress MP said. He wanted the court to direct the Centre to assist the state of Andhra Pradesh to complete the project as per schedule. Stating that the Centre's decision to impose a 2014 cut-off was on account of a recommendation by Niti Ayog, the MP questioned the validity of such a recommendation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X