లగడపాటి ఇంటి ముట్టడి: సమ్మెపై విచారణ వాయిదా

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు సోమవారం ఆందోళనకు దిగారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ హైదరాబాద్, విజయవాడల్లోని నివాసాలను విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు సోమవారం ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని పరిస్థితి అదుపునకు ప్రయత్నించారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా కృష్ణా జిల్లాలోని విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ నేత దేవినేని చంద్రశేఖర్ సోమవారం 72 గంటల దీక్షకు దిగారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు దేవినేని ఉమా, గద్దెరామ్మోహన్, విద్యాసాగర్ దీక్షకు మద్దతు తెలిపారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖపట్నంలో సోమవారం ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు. రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, సమైక్యవాదులు తరలివస్తున్నారు.












Click it and Unblock the Notifications