షాకింగ్...ఎపిలో ఎట్టి పరిస్థితుల్లోను కోడిపందేలు జరగకూడదని హైకోర్టు ఆదేశాలు
కోడిపందాలపై హైకోర్టు తీర్పు పందెం రాయుళ్లకు షాకిచ్చింది. అంతేకాదు కోడి పందాల నిర్వహణ విషయంలో ఎపి ప్రభుత్వం తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టడమే కాకుండా గత ఏడాది కోడిపందాల ను నిరోధించడంలో విఫలమైనందుకు అత్యున్నత స్థాయి అధికారులకు సైతం నోటీసులు జారీచెయ్యడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎట్టి పరిస్థితుల్లోను ఈ ఏడాదైనా సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

పైగా గత ఏడాది హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోలేదని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోడి పందాలను నిరోధించడంలో విఫలమైనందుకు గాను సీఎస్, డీజీపీ తో సహా 43 మంది తహశీల్దారులు, 49 మంది స్టేషన్ హౌస్ అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఎపి ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశించింది. సంక్రాంతి దగ్గర కొస్తున్నకొలదీ కోడి పందేల సందడి మొదలవుతోంది. ముఖ్యమంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్ల పందేల కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. భీమవరంలో సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించాలంటూ రామచంద్రరాజు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు ఆదేవాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కోడిపందాలు నిర్వహించకూడదని, పూర్తి నివేదికను ఈ నెల 22 వరకు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.












Click it and Unblock the Notifications