విభజనపై పిటిషన్ హైకోర్టు కొట్టివేత, 5వేలు జరిమానా

రాయలసీమ విభజన సరికాదు: మర్రి
రాయలసీమను రెండుగా విభజించి రాయల తెలంగాణ, రాయల ఆంధ్రను ఏర్పాటు చేయటం సరికాదని సనత్ నగర్ కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలన్న వాదనకు అన్ని పార్టీల నుండి మద్దతు లభిస్తోందన్నారు.
మీడియాలో చూస్తున్నా: శైలజానాథ్
కొత్త పార్టీ పైన తాను మీడియాలోనే చూస్తున్నానని మంత్రి శైలజానాథ్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. తాము సమైక్యాంధ్ర మినహా రాయల తెలంగాణ, ఇతరత్రా వాటిని అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. జివోఎం బిల్లు పంపించాక తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు.
ఒప్పందంలో భాగంగా: విద్యాసాగర రావు
కాంగ్రెస్ - మజ్లిస్ పార్టీలు తమ ఒప్పందంలో భాగంగా రాయల తెలంగాణ ప్రతిపాదనను తెర పైకి తీసుకు వచ్చాయని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత విద్యాసాగర రావు ఆరోపించారు. రాయల తెలంగాణను తమ పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications