ఆ పెద్దలను ప్రశ్నించకూడదా?: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మంగళవార ఆగ్రహం వ్యక్తం చేసింది. హంద్రీ-నీవా నదిలో ఇసుక అక్రమ రవాణాపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అసలక్కడ ఏం జరుగుతోందంటూ ప్రశ్నించింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు మంగళవార ఆగ్రహం వ్యక్తం చేసింది.
హంద్రీ-నీవా నదిలో ఇసుక అక్రమ రవాణాపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అసలక్కడ ఏం జరుగుతోందంటూ ప్రశ్నించింది.

'ప్రజల భూముల్లో చట్టవ్యతిరేకంగా ట్రాక్‌లు నిర్మించారు. రేపు మీ వంతు, తర్వాత మా వంతు కావచ్చు. ఆ పెద్ద మనుషుల్ని ఎవరూ ప్రశ్నించకూడదా? సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతవరకు వచ్చింది?' అంటూ ఏపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది.

high court fires at AP government for handri neeva sand scam

కర్నూలు జిల్లాలోని కిషన్‌గిరి, కందుకూరు మండలాల పరిధిలో హంద్రీ-నీవా నదిలోంచి ఇసుకను అక్రమంగా తరలించుకుపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయంటూ రైతులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ వ్యాజ్యాన్ని విచారించింది. పిటిషనర్ల తరపున న్యాయవాది సమర్పించిన ఇసుక రవాణా ట్రాక్‌ల నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలను కోర్టు పరిశీలించింది. దీని వెనక ఉన్న పెద్ద మనుషులపై చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించింది. ఇప్పటి వరకు 644 వాహనాలను పట్టుకున్నట్టు చెబుతున్నారని, ఎన్నింటిని సీజ్ చేశారని ప్రశ్నించింది. తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+