వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్డు వాలంటీర్లపై ఎస్ఈసి ఆంక్షలు : హైకోర్టులో జగన్ సర్కార్ పిటీషన్ పై విచారణ , తీర్పు రిజర్వ్

|
Google Oneindia TeluguNews

మున్సిపల్ ఎన్నికలలో వార్డు వాలంటీర్లను దూరం పెట్టాలని, వార్డు వాలంటీర్లపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కఠిన ఆంక్షలను సవాల్ చేస్తూ హైకోర్టులో జగన్ సర్కార్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ పిటిషన్ పై విచారణ కొనసాగించిన హైకోర్టు ధర్మాసనం ఇరువర్గాల వాదనలు విన్నది. రాజకీయ పక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు వార్డు వాలంటీర్ ల విషయంలో చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు.

వార్డు వాలంటీర్లపై ఎస్ఈసి ఆంక్షలపై జగన్ సర్కార్ సవాల్ .. హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్వార్డు వాలంటీర్లపై ఎస్ఈసి ఆంక్షలపై జగన్ సర్కార్ సవాల్ .. హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్

వాలంటీర్ లపై దాదాపు 600ఫిర్యాదులు వచ్చాయని కోర్టుకు చెప్పిన ఎస్ఈసీ తరపు న్యాయవాది

వాలంటీర్ లపై దాదాపు 600ఫిర్యాదులు వచ్చాయని కోర్టుకు చెప్పిన ఎస్ఈసీ తరపు న్యాయవాది

వాలంటీర్లు నేరుగా బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చాయని, దాదాపు వారిపై 600 ఫిర్యాదుల మేరకు అందాయని హైకోర్టు ధర్మాసనానికి ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది వివరించారు. లబ్ధిదారులు అధికార పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలని వాలంటీర్లు బెదిరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. వాలంటీర్లను స్థానిక నేతలు ప్రభావితం చేస్తున్నారని, అధికార పార్టీకి అనుకూలంగా మలచుకుంటూ తమ పార్టీ కోసం ప్రచారం చేయించుకుంటున్నారని పేర్కొన్నారు.

వాలంటీర్ల పై నిర్ణయం తీసుకోవటానికి కారణాలు ధర్మాసనం దృష్టికి

వాలంటీర్ల పై నిర్ణయం తీసుకోవటానికి కారణాలు ధర్మాసనం దృష్టికి

ఓటర్ స్లిప్పుల పంపిణీలో కూడా వాలంటీర్లు జోక్యం చేసుకుంటున్నారని, అధికార పార్టీ అనుచరులకు స్లిప్పులు ఇచ్చి, ప్రత్యర్థి వర్గాలకు స్లిప్పులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులు అందిన మేరకు వాలంటీర్ల జోక్యాన్ని ఎన్నికల ప్రక్రియలో నివారించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ ల మీద వచ్చిన ఫిర్యాదుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు కోర్టుకు వివరించారు .

 ప్రభుత్వ వాదన ఇలా ... వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

ప్రభుత్వ వాదన ఇలా ... వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

ఇక ప్రభుత్వం వాలంటీర్లు పెన్షన్ ల అందజేత, ప్రభుత్వ పథకాల అమలులో పాల్గొనకపోతే లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని కోర్టు దృష్టికి తీసుకు వెళ్ళింది . వార్డు వాలంటీర్లు వద్దనున్న ట్యాబ్ లను స్వాధీనం చేసుకోవాలన్న ఆదేశాలపై కూడా ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తే ఏదైనా ఇబ్బంది ఉందా అన్న ప్రశ్నకు రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది పెన్షన్ల పంపిణీకి తమకు ఇబ్బంది ఏమీ లేదని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేసింది.

English summary
Andhra Pradesh government filed a lunch motion petition at the state High Court against the State Election Commissioner Nimmagadda Ramesh Kumar's orders to keep ward volunteers away from the municipal polls. The government raised objections over SEC orders. The court heard the arguements and reserved the judgment .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X