చంద్రబాబుకు ఫిరాయింపు ఝలక్: అఖిలప్రియ సహా నలుగురికి హైకోర్టు షాక్

తెలుగుదేశం పార్టీకి షాక్. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊరట.వైసిపి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి, టిడిపిలో చేరి, మంత్రి పదవులు పొందిన వారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

అమరావతి: తెలుగుదేశం పార్టీకి షాక్. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊరట. వైసిపి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి, టిడిపిలో చేరి, మంత్రి పదవులు పొందిన వారికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది.

ఫిరాయింపుతో పదవులు

ఫిరాయింపుతో పదవులు

2014 ఎన్నికల్లో వైసిపి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి, ఆ తర్వాత అధికార పార్టీలో చేరి, మంత్రులు అయ్యారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పార్టీ ఫిరాయించి ఉన్నత పదవులు పొందడం సరికాదని పేర్కొన్నారు.

నలుగురికి నోటీసులు

నలుగురికి నోటీసులు

దీనిపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. అనంతరం వైసిపి నుంచి గెలిచి, టిడిపిలో మంత్రులు అయిన నలుగురికి నోటీసులు పంపించింది.

Recommended Video

    YS Jagan Shock To Bhuma Akhila Priya
    ఫిరాయించింది వీరే..

    ఫిరాయించింది వీరే..

    మంత్రులు భూమా అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావులకు న్యాయస్థానం నోటీసులు పంపించింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆందులో ఆదేశాలు జారీ చేసింది.

    జర్నలిస్ట్ శివప్రసాద్ రెడ్డి పిటిషన్.. తలసానిపై..

    జర్నలిస్ట్ శివప్రసాద్ రెడ్డి పిటిషన్.. తలసానిపై..

    పార్టీ ఫిరాయించి మంత్రి పదవులు అనుభవించడం చట్ట విరుద్ధమని ప్రముఖ జర్నలిస్ట్ శివప్రసాద్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫిరాయింపు అంశాన్ని కూడా దీంతో కలిపి విచారిస్తామని హైకోర్టు తెలిపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+