ఆయేషా హత్య: సత్యంబాబు నిర్దోషి, హైకోర్టు సంచలన తీర్పు, పోలీసులపై ఆగ్రహం

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఆయేషా మీరా హత్య కేసులో హైకోర్టు శుక్రవారం నాడు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడిగా చెబుతున్న సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది. ఆధారాలు లేకుండా ఎనిమిదేళ్లుగా సత్యంబాబును జైలులో ఉంచారని పోలీసులను హైకోర్టు మందలించింది.

ఆయేషా హత్య కేసుతో నాకు సంబంధం లేదు: కోనేరు సతీష్

సత్యంబాబుకు రూ.లక్ష నష్టపరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటి పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

High Court judgement on Ayesha Meera murder case.

కాగా, ఆయేషా మీరా హత్య కేసు 2007లో చోటు చేసుకుంది. ఆమె గదిలోకి చొరబడి అత్యాచారం చేసి, హత్య చేశాడని సత్యం బాబుపై ఆరోపణలు ఉన్నాయి. ఓ సమయంలో సత్యంబాబు నడవలేని పరిస్థితి కూడా కనిపించింది.

అయితే, ఆ హత్యను ఓ రాజకీయ నాయకుడి బంధువు చేశాడనే విమర్శలు కూడా ఉన్నాయి. సత్యంబాబు పైన ఆ అత్యాచారం, హత్యను మోపినట్లుగా కూడా చెబుతారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తాజా తీర్పులో సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
High Court judgement on Ayesha Meera murder case.
Please Wait while comments are loading...