బాబుకు ఎదురు దెబ్బ, ఇక బిగ్ ఫైట్: రోజా, కోర్టులో ఏంజరిగింది.. ఆరా
హైదరాబాద్: ప్రజా సమస్యల పైన తాను 1999 నుంచి పోరాడుతాన్నానని, ముఖ్యమంత్రి పైన అయినా తాను ఫైట్ చేస్తానని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా గురువారం నాడు చెప్పారు. రోజాకు ఈ రోజు హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే.
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రోజాను స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఏడాది పాటు సస్పెండ్ చేశారు. రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ శాసనసభ చేసిన తీర్మానాన్ని హైకోర్టు గురువారంనాడు కొట్టేసింది. హైకోర్టు తీర్పుపై రోజా మాట్లాడారు.
ఇది నాది మాత్రమే కాదని, నా నియోజకవర్గ ప్రజలది కూడా అన్నారు. తాను తన నియోజకవర్గ ప్రజలకు తాను ప్రతినిధిగా ఉన్నానని, వారికి న్యాయం చేయాలంటే తాను అసెంబ్లీకి వెళ్లాలన్నారు. తాను సభకు వెళ్లేందుకు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సంతోషకరమన్నారు.

తనకు న్యాయం దొదికిందని, తద్వారా తనకు న్యాయస్థానాల పైన నమ్మకం రెట్టింపు అయిందన్నారు. కచ్చితంగా ప్రజల సమస్యల పైన ప్రభుత్వాన్ని నేను నిలదీస్తానని చెప్పారు. 1999లో నేను రాజకీయాల్లోకి వచ్చానని, ఏ పార్టీ అయినా తాను ప్రజల కోసం పోరాడుతానని చెప్పారు.
తాను ప్రజా సమస్యల పైన పోరాడుతానని, ముఖ్యమంత్రి అయినా తాను పోరాడుతానని చెప్పారు. నేను కచ్చితంగా అసెంబ్లీకి వెళ్తానని చెప్పారు. తనకు ఆర్డర్ కాపీ చేతికి రాగానే అసెంబ్లీకి వెళ్తానని చెప్పారు. అసెంబ్లీ సెక్రటరీకి కూడా మెయిల్ పెడతానని చెప్పారన్నారు.
రోజా ఈ రోజు అసెంబ్లీకి హాజరు కావొచ్చు: ఇందిరా జైసింగ్
రోజా ఈ రోజు అసెంబ్లీకి హాజరు కావొచ్చునని ఆమె తరఫున వాదనలు వినిపించిన ఇందిరా జైసింగ్ చెప్పారు. ఉత్తర్వులను అసెంబ్లీ సెక్రటరీకి మెయిల్ ద్వారా పంపిస్తామని చెప్పారన్నారు.
రోజా వచ్చి పోరాటం చేస్తుంది: కల్పన, ఈశ్వరి
హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు అని వైసిపి ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, గిడ్డి ఈశ్వరి అన్నారు. వారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ప్రభుత్వం రోజా విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పన్నట్లు రోజాను సస్పెండ్ చేశారన్నారు.
రోజా వచ్చి అసెంబ్లీలో పోరాడుతారని చెప్పారు. అధికార పార్టీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఒక సెషన్ వరకే రోజాను సస్పెండ్ చేయాల్సింది, కావాలని ఏడాది పాటు సస్పెండ్ చేశారని విమర్శించారు. ప్రతిపక్షం గొంతు నొక్కేలా ప్రభుత్వం ప్రవర్తిస్తోందన్నారు.
రోజాను చూసి మేం గర్వపడుతున్నామన్నారు. ఆమె ధైర్యవంతురాలని, నిష్పక్షపాతంగా మాట్లాడే వ్యక్తి అన్నారు. అలాంటి వ్యక్తి మా పార్టీలో ఉన్నందుకు గర్విస్తున్నామన్నారు. గట్టిగా మాట్లాడితే కేసులు, చర్యలా అని ప్రశ్నించారు. రేపటి నుంచి మహిళలపై జరిగే అఘాయిత్యాల పైన రోజా మరింత గట్టిగా పోరాడుతారని చెప్పారు.
ఇది చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అన్నారు. ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ వ్రజా వ్యతిరేక కార్యకలాపాలను తీసుకు వెళ్తామని చెప్పారు. భగవంతుడు ఉన్నాడని, ధర్మమే గెలిచిందని చెప్పారు. లేనిపోని ఆరోపణలతో రోజాను సస్పెండ్ చేశారన్నారు. చివరకు ధర్మం గెలిచిందని, ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
నగరిలో టపాసులు పేల్చిన కార్యకర్తలు
రోజాకు అనుకూలంగా హైకోర్టులో తీర్పు వచ్చిన నేపథ్యంలో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో టపాసులు పేల్చారు. మిఠాయిలు పంచుకొని ఆనందం తెలిపారు. కాగా, కోర్టులో జరిగిన విషయమై చంద్రబాబు, యనమల, జగన్ ఇతర నేతలు ఆరా తీస్తున్నారు.
-
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications