వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజాపై వ్యాఖ్యలు, టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పైన కేసు నమోదు చేయాలని హైకోర్టు మంగళవారం ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తనపై బోడె ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని రోజా కొద్ది రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు కోర్టు కేసు నమోదు చేయాలని చెప్పింది.

తనపై బోడె ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా అంతకుముందు కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంతో ఆమె హైకోర్టుకు వెళ్లారు.

రూ.500తో పోయే బాబ్లీ కేసుపై రాద్ధాంతం, జగన్‌కిస్తే అలా, మీకు వస్తే ఇలా: బాబుపై విష్ణురూ.500తో పోయే బాబ్లీ కేసుపై రాద్ధాంతం, జగన్‌కిస్తే అలా, మీకు వస్తే ఇలా: బాబుపై విష్ణు

High Court orders to police to register case against TDP MLA Bode Prasad

బోడె ప్రసాద్ పైన కేసు నమోదు చేయకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, అతనిపై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆగస్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, విజయవాడ పోలీస్ కమిషనర్, పెనమలూరు ఎస్ఎహెచ్ఓలను ప్రతివాదులుగా చేర్చారు.

రోజాపై బోడె ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్లో తన పేరు ఉందని రోజా ఆరోపణలు చేయడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. పరుష పదజాలంతో దూషించారు. తమ నియోజకవర్గంకు వస్తే రోజాపై చెప్పులు, గుడ్లు పడతాయన్నారు. రోజా ఓ మహిళ గానీ మహిళ అని, ఆమె తనపై ఈ విధంగా మాట్లతాడటం సిగ్గుచేటన్నారు. తనపై ఆరోపణలు చేస్తుండటంతో మూడేళ్లుగా కడుపు రగిలిపోతోందని, అందుకే ఈ రోజు ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందన్నారు. మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు.

English summary
High Court ordered Andhra Pradesh police to register case against Telugu Desam Party MLA Bode Prasad for comments on YSR Congress Party MLA Roja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X