వెంకయ్యకు హోదా సెగ: బెజవాడలో ఉద్రిక్తత: గో బ్యాక్ అంటూ నినాదాలు

అమరావతి: విజయవాడలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు శనివారం పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనను అడ్డుకునేందుకు వామపక్షాల నేతల యత్నించారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగానే వెంకయ్యకు రాష్ట్ర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

అనంతరం విమానాశ్రయం నుంచి నేరుగా విజయవాడకు ఆయన భారీ ర్యాలీగా తరలివస్తున్నారు. రామవరప్పాడు రింగ్ వద్ద వెంకయ్య నాయుడు, బీజేపీ నేతల ర్యాలీని అడ్డుకున్నారు. వెంకయ్య రాకను నిరసిస్తూ సీపీఐ, సీపీఎం నేతలు కార్యకర్తలు నగరంలోని రామవరప్పాడు జంక్షన్ ఆందోళనకు దిగారు.

హోదాపై మాట తప్పిన వెంకయ్య గోబ్యాక్ అంటూ వారు నల్లజెండాలు చేతపట్టి పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు. ఏపీకి హోదా సాధనలో వెంకయ్య వెనకడుగు వేశారని, ఆయన ఎప్పుడు నగరానికి వచ్చినా ఆయన పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.

దీంతో రామవరప్పాడు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగం ప్రవేశం చేసి వామపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా గత కొన్ని రోజులుగా కేంద్ర మంత్రి వెంకయ్య కమ్యూనిస్టు నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

venkaiah naidu

కమ్యూనిస్టుల వల్ల తయారీ, ఉత్పత్తి తగ్గి టెన్షన్ పెరిగిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అది పంచాలి, ఇది పంచాలి అంటూ వారు డిమాండ్ చేస్తుంటారని, ఏదైనా పెంచకుండా పంచితే చివరకు మిగిలేదని పంచేనంటూ చలోక్తులు విసిరారు.

వర్కర్స్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా దత్తోపంథ్ తెంగడి జాతీయ బోర్డు శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య మాట్లాడుతూ ప్రపంచమంతా మేడే రోజున కార్మిక దినోత్సవం జరుపుకుంటుందని, కానీ మన దేశంలో విశ్వకర్మ జయంతి రోజున కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటారని అన్నారు.

ఇది మనకు సంప్రదాయంగా వచ్చిందన్నారు. కార్మికుడు, యజమాని రెండు చక్రాల్లాంటి వారని, వారు కలిసే ప్రయాణం సాగించాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టులపై ఆయన మండిపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడడం మంచిది కాదని సూచించారు. అసంఘటిత రంగ కార్మికులపై కేంద్రం దృష్టి సారించిందని పేర్కొన్న వెంకయ్య స్కిల్ ఇండియా పథకం ద్వారా వారికి శిక్షణ ఇప్పిస్తున్నట్టు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+