• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎం జగన్ కు కేంద్రం షాక్ ఇందుకే..జైల్లోనే డిసైడయ్యారు.. వైసీపీలో కులవివక్షపై టీడీపీ స్క్రీన్ షాట్స్

|

''నేను ట్వీట్ పెడితేనే వైసీపీ నేతలు గజగజ వణుకుతున్నారు.. ఇక ఫీల్డులోకి దిగితే ఇంకెంత భయపడతారో..'' అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు.. ఆంధ్రప్రదేశ్‌లో నిజంగానే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. లోకేశ్ ను చిట్టినాయుడిగా సంబోధిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పదునైన వ్యంగ్యాస్త్రాలు సంధించగా.. వాటికి టీడీపీ నేతలు ఘాటుగా కౌంటర్లిచ్చారు. ఈక్రమంలో కేంద్రంతో సీఎం జగన్ సంబంధాలు బెడిసికొట్టడం.. వైసీపీలో కుల వివక్ష తదిర అంశాలు ప్రస్తావనకొచ్చాయి..

కుంభకోణాల చిట్టాతో చంద్రబాబు సంచలనం.. చేపల చెరువుకు కొంగల కాపలా.. జగన్‌పై నిప్పులు..

అమిత్ షా అపాయింట్మెంట్..

అమిత్ షా అపాయింట్మెంట్..

గత వారం ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన చివరి నిమిషంలో రద్దు కావడం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. జగన్ కు ఇచ్చిన అపాయింట్మెంట్ రద్దు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. దాని వెనకున్న అసలు కారణం ఇదేనంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని కొత్త వ్యాఖ్యానాలు జోడించారు. చంద్రబాబు మనసంతా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతోందని, మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకుని అయినా బీజేపీకి దగ్గరయ్యేందుకు బాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ విజయసాయి పేర్కొనగా.. సీఎం జగన్ కు కేంద్రం పెద్దలు అపాంట్మెంట్లు ఇచ్చినట్లే ఇచ్చి రద్దు చేసింది బహుశా ఇందుకేనేమో అని కేశినేని చెప్పుకొచ్చారు.

జైల్లోనే ఫిక్స్ అయ్యారు..

జైల్లోనే ఫిక్స్ అయ్యారు..

వైసీపీ ఏడాది పాలనలో జరిగిన కుంభకోణాలు ఇవంటూ చంద్రబాబు భారీ ఆరోపణలు చేయడం, చాలా కాలం తర్వాత లోకేశ్ నేరుగా మీడియాతో మాట్లాడటం లాంటి ఘటనలు ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. అధికార వైసీపీ మాత్రం దీన్ని తేలికగా కొట్టిపారేసింది. ‘‘ఈ లాక్ డౌన్ సమయంలో తండ్రీకొడుకులు కలిసి ఒకే ఇంట్లో గడిపిన తర్వాత ఇద్దరూ చెరో నిర్ధారణకు వచ్చారు. కొడుకు ఎందుకూ పనికిరాడని తండ్రి, చెడ్డతనం తప్ప తండ్రికి మరో సంగతే తెలీదని కొడుకు తెల్సుకున్నారు''అని ఎంపీ ఎద్దేవా చేయగా.. ‘‘అవునుమరి, ఏ1, ఏ2లుగా సంవత్సర కాలం పైనే జైలులో కలిసి ఉన్న మీ ఇద్దరూ ప్రజాధనాన్ని దోచుకోడానికి మాత్రమే పనికొస్తామని డిసైడ్ అయ్యారా?'' అంటూ ఎంపీ నాని ఫైరయ్యారు.

3 సార్లు సీఎం..అడుక్కునే స్థితిలో కుటుంబం.. భోలా శాస్త్రి ఫ్యామిలీ దీనగాథ.. లాక్ డౌన్ లో తిండి లేక..

మిగిలేది అవమానమే..

మిగిలేది అవమానమే..

లోకేశ్ ప్రెస్ మీట్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అదే పనిగా విమర్శలు, కౌంటర్లు, వ్యంగ్యాస్త్రాలు సంధించడంపై టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్, రాజ్యసభ అభ్యర్థి వర్ల రామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకేశ్ మాటలు నిజంగానే తూటాల్లా తగిలాయి కాబట్టే అధికార పార్టీ నేతలు ఇంతలా గింజుకుంటున్నారని చెప్పారు. ‘‘విజయసాయి రెడ్డి.. మీకు వెటకారం చాలా ఎక్కువైంది. ఇది పెరిగితే చివరికి మిగిలేది అవమానమేనని తెల్సుకోండి. మా లోకేష్ ప్రెస్ మీట్ చూసి మీరు ఖంగుతిన్న మాట వాస్తవం కాదా? మీ నాయకుడు(జగన్) కూడా ఇలాంటి ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారా? అని ఆలోచించి, గతి తప్పి, వెటకారం జోడిస్తున్నారు కదా? ఆ లెక్కన లోకేష్ మాటలు,తూటాలే కదా?''అని వర్ల రివర్స్ అటాక్ చేశారు.

వైసీపీలో కులవివక్ష..

వైసీపీలో కులవివక్ష..

అధికార వైసీపీలో తీవ్రమైన కుల వివక్ష కొనసాగుతోందని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఇటీవల మంత్రి ఆదిమూలపు సురేశ్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మధ్య చోటుచేసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. ఓ వాట్సప్ గ్రూప్ వేదికగా మంత్రి పీఏకు, ఎమ్మెల్యేకు మధ్య కొనసాగిన మాటల యుద్ధం తాలూకు స్క్రీన్ షాట్లను సాక్ష్యాలుగా పేర్కొంటూ వాటిని వర్ల విడుదల చేశారు. దళితుడైన మంత్రిపై రెడ్డి వర్గానికి చెందిన ఎమ్మెల్యే శాసిస్తున్నాడని వర్ల ఆరోపించారు.

  Nara Lokesh About Electricity Bills Hike In Andhra pradesh | కరెంటు బిల్లు చూస్తే భయమేస్తుంది
  ఇదీ వివాదం..

  ఇదీ వివాదం..

  మంత్రి సురేశ్ దగ్గర పీఏగా పనిచేస్తోన్న వ్యక్తి.. వైసీపీకి చెందిన ఓ వాట్సప్ గ్రూపులో ఓ వీడియోను పోస్ట్ చేశారు. మంత్రిగా సురేశ్ ఇప్పటిదాకా చేసిన మంచి పనులను ఆ వీడియోలో పేర్కొన్నారు. అయితే, వార్తల షేరింగ్ కోసం ఉద్దేశించి వాట్సప్ గ్రూపులో ఇలాంటి వీడియోలు పెట్టడమేంటని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వర్ల రామయ్య తెలిపారు. ఆర్కే కామెంట్లతో కూడిన స్క్రీన్ షాట్ ను కూడా ఆయన బటయపెట్టారు. సదరు వీడియోను తొలగించేదాకా ఆర్కే ఊరుకోలేదని, తద్వారా రెడ్డి ఎమ్మెల్యే చేతిలో దళిత మంత్రి కుల వివక్షకు గురయ్యారని వర్ల వివరించారు. ఈ వివాదంపై వైసీపీ నేతలు స్పందించాల్సి ఉంది.

  English summary
  tdp leaders varla ramaiah, kesineni nani slams ysrcp mp vijaya sai reddy for making fun of nara lokesh press meet. opposition pointed out cm jagan, delhi relations
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X