ఎయిడ్స్: పెళ్లికి సిద్ధమైన యువకుడు, వధువుని రక్షించిన పోలీసులు
హైదరాబాద్: ఎయిడ్స్ బారినపడి ఓ వ్యక్తి దాన్ని దాచి పెట్టి పెళ్లి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతనికి తగిన బుద్ధి చెప్పారు. వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లాలోని శామూన్ పేటకు చెందిన రాజశేఖర్‌కు అనంతసాగర్‌కు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయం అయ్యింది.
గురువారం ఉదయం వీరిద్దరికి పెళ్లి జరగాల్సి ఉంది. అదే సమయంలో రాజశేఖర్‌కు హెచ్‌ఐవీ పాజిటివ్ తుది దశకు చేరుకున్నట్లుగా సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పెళ్లిని ఆపారు. విషయం తెలుసుకున్న పెళ్లి కుమార్తె బంధువులు అవాక్కయ్యారు.

కరుణ మైత్రి, స్నేహ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమాచారం మేరకే తాము ఇక్కడి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా రాజశేఖర్ ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్లు ప్రతినిధులు తెలిపారు. అప్పటి నుంచి ముందులు తీసుకుంటున్న రాజశేఖర్ గత 15 రోజులుగా రాకపోడవంతో అనుమానం వచ్చిన సంస్ధ ప్రతినిధులు ఆరా తీయడంతో అసలు విషయం తెలిసి పోలీసులకు తెలియజేశారు.
దీంతో విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని వివాహాన్ని ఆపేసి రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి సందర్భంగా రాజశేఖర్‌కి, పెళ్లి కుమార్తె కుటుంబం కట్నం కూడా సమర్పించుకుంది. అసలు విషయం తెలియడంతో పెళ్లి కుమార్తె తరుపు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications