రైల్వే శుభవార్త.. హోలీ పండుగకు ప్రత్యేక రైళ్ళ ప్రకటన!
దక్షిణ మధ్య రైల్వే, రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించడం కోసం తమ వంతుగా ఎప్పుడు కృషి చేస్తూనే ఉంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే ప్రయాణికులకు పండుగలకు, పబ్బాలకు అవసరమైన ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంతో పాటు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మరొక శుభవార్త చెప్పింది దక్షిణ మధ్య రైల్వే.
హోలీ పండుగకు ప్రధాన నగరాల మధ్య ప్రత్యేక రైళ్ళు
హోలీ పండుగకు చాలా మంది తమ సొంత ఊర్లకు ప్రయాణాలు చేస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని, హోలీకి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండడం కోసం సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి దక్షిణ మధ్య రైల్వే భారీగా ఏర్పాట్లను చేస్తుంది. ఈ క్రమంలోనే హోలీ పండుగకు ప్రధాన నగరాల మధ్య మెరుగైన అనుసంధానం కోసం ఏకంగా 160 ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.

మార్చి నెలలో ప్రయాణికులకు అందుబాటులో
ఈ ప్రత్యేక సర్వీసులు అన్ని మార్చి నెలలో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి దేశంలోని ప్రధాన గమ్యస్థానాలకు ఈ రైళ్ళు ప్రయాణికులను చేరవేస్తాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రయాణికుల సౌకర్యం కోసం పలు కీలక రైలు మార్గాలలో ఈ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రాంతాలకు స్పెషల్ రైళ్ళు
విశాఖపట్నం, హైదరాబాద్, పాట్నా, లక్నో, దానాపూర్, బిలాస్పూర్, సోలాపూర్, రాజ్కోట్, రక్సాల్, నహర్లగాన్, హజరత్ నిజాముద్దీన్, షాలిమార్, సంత్రాగచ్చి, మాల్దా టౌన్, ఛాప్రా వంటి ముఖ్యమైన ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్ల సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ గమ్య స్థానాల నుంచి ప్రయాణికులు తిరిగి ప్రయాణం చేయడానికి కూడా ప్రత్యేక సర్వీసులను ప్లాన్ చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
హోలీ పండుగ ప్రయాణాల కోసం దక్షిణ మధ్య రైల్వే శుభవార్త
ఇటీవల సంక్రాంతి పండుగకు అదనపు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి, ప్రయాణికులకు సౌకర్యాలను కల్పించిన దక్షిణ మధ్య రైల్వే తిరిగి, హోలీ పండుగకు ప్రత్యేక రైళ్లను నిర్వహించడానికి రెడీ అవుతోంది. ఇది తెలుగు రాష్ట్రాలలో హోలీ పండుగకు ఊర్లకు వెళ్ళాలి అనుకునే ప్రయాణికులకు శుభవార్తనే.












Click it and Unblock the Notifications