చంద్రబాబుపై నోటికొచ్చింది మాట్లాడితే జరిగేదిదే: హోంమంత్రి అనిత సీరియస్ వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డు తయారీకి వాడిన నెయ్యి కల్తీ వ్యవహారం పైన సిట్ రిపోర్ట్ నేపథ్యంలో టిడిపి వైసిపి మధ్య మొదలైన మాటలయుద్ధం ఈరోజు అంబటి రాంబాబు ఇంటిపైన దాడి వరకు వెళ్ళింది. తెలుగుదేశంనేతలు ఏర్పాటు చేసిన మహా పాపం ఫ్లెక్సీలను తొలగించడం కోసం వెళ్లిన అంబటి రాంబాబుపైన దాడికి ప్రయత్నం చేసిన క్రమంలో అంబటి రాంబాబు టిడిపి కార్యకర్తలతో పాటు, చంద్రబాబుపైన అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు.

చంద్రబాబుపైన అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలపై హోంమంత్రి సీరియస్

పరిస్థితి తీవ్రత దృష్ట్యా పోలీసులు అంబటి రాంబాబును అక్కడినుండి పంపించేశారు. చంద్రబాబుపైన అంబటి రాంబాబు చేసిన తీవ్రవ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టిడిపి కార్యకర్తలు ఆయన ఇంటికి వెళ్లి విధ్వంసం సృష్టించారు. గంటపాటు అంబటి రాంబాబు ఇంటివద్ద విధ్వంసం సృష్టించిన వారిని పోలీసులు ఆపలేకపోయారు. ఇదిలా ఉంటే తాజా పరిణామాల పైన, అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబుపైన చేసిన వ్యాఖ్యలపైన ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు.

Home Minister Anitha serious warning to ambati rambabu on his abusive comments on cm chandrababu

అత్యంత అనుచితం అంటూ ఫైర్

అంబటి రాంబాబు చంద్రబాబు పైన మాట్లాడిన తీరు అత్యంత అనుచితమని ఆమె అన్నారు. గతంలో తాను గౌరవంగా అంబటి రాంబాబు గారు అని పిలిచే దానిని అని పేర్కొన్న హోమ్ మంత్రి వంగలపూడి అనిత, కానీ ఇప్పుడు ఆ గారు అనే పదానికి అంబటి రాంబాబు అర్హుడు కాదన్నారు. ఆయన మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్యానికి హానికరమని అనిత అభిప్రాయపడ్డారు.

వారిపై కఠిన చర్యలు తప్పవు

ఆయన చేసిన వ్యాఖ్యల పైన ఇంటికి వెళ్లి తన భార్యను కూతురును అడగాలని వ్యాఖ్యలు చేశారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. వైసీపీ నేతలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని వంగలపూడి అనిత స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వాళ్ళపైన కఠిన చర్యలు తప్పవన్నారు.

చంద్రబాబు గురించి ఇష్టానుసారం మాట్లాడితే జరిగేదిదే

అంబటి రాంబాబు లాంటి వాళ్ల కోసం మాట్లాడాల్సి రావడమే సిగ్గుచేటు అంటూ ఆమె వ్యాఖ్యానించారు. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో పట్టాభి ఒక పదం ఉపయోగించారు అనే కారణంతో టిడిపి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు గురించి ఇష్టానుసారం మాట్లాడితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయన్నారు. కేసు నమోదు చేసి చర్యలు చేపడతామన్నారు.

చంద్రబాబును జైలులో పెట్టినందుకే వైసీపీ పరిస్థితి ఇలా

సీఎం చంద్రబాబును ఒక మాటంటే రాష్ట్ర ప్రజలందరినీ అవమానించినట్లేనన్నారు. నిబద్ధత కలిగిన నాయకుడు చంద్రబాబు అని హోం మంత్రి అనిత కితాబిచ్చారు. చంద్రబాబు నాయుడుపై అన్యాయంగా కేసులు పెట్టి జైలులో ఉంచిన అందుకే వైసీపీ 11 సీట్లకు పరిమితమైందని గుర్తు చేశారు. మళ్లీ మంచి వ్యక్తిని టార్గెట్ చేయాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు.

కల్తీ నెయ్యి అంశంలో వైసిపి పైన రాష్ట్ర ప్రజలు ఉమ్మేస్తున్నారు

తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి అంశంలో వైసిపి పైన రాష్ట్ర ప్రజలు ఉమ్మేస్తున్నారని, ఈ వ్యవహారంలో 250 కోట్లకు పైగా కుంభకోణం చేశారని వంగలపూడి అనిత అన్నారు. ఈ అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం అంబటి రాంబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇదంతా చేస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+