విజయవాడ కిడ్నీ రాకెట్ పై కీలక ఆదేశాలిచ్చిన హోం మంత్రి అనిత

విజయవాడలో లోన్ యాప్ బాధితుడు కిడ్నీ అమ్ముకున్న ఘటనతో ఏపీ కిడ్నీ రాకెట్ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపింది. ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత దృష్టి సారించారు. ఈ కిడ్నీ రాకెట్ లో హస్తమున్న ఏ ఒక్కరిని విడిచిపెట్టరాదని వాళ్లపై కఠిన చర్యలు తీసుకొని బాధితులు మధుబాబు కి న్యాయం చేయాలని చెప్పారు.

లోన్ యాప్ అప్పు కోసం కిడ్నీ రాకెట్ ట్రాప్ లో ఆటో డ్రైవర్
లోన్ యాప్ లో తీసుకున్న అప్పు చెల్లించడం కోసం మధుబాబు అనే ఆటో డ్రైవర్ కిడ్నీ దానం చేస్తే 30 లక్షలు ఇస్తామంటూ ఫేస్బుక్లో చూసిన ప్రకటన తో కిడ్నీ దానం చేసాడు. అయితే బాధితుడికి లక్ష రూపాయలు ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వకుండా తిప్పుకోవడంతో మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు.

Home minister vangalapudi anitha serious and gave directions to police on kidney racket

కిడ్నీ అమ్ముకున్న ఆటో డ్రైవర్
బాధితుడు గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా సాగుతున్న కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది. గుంటూరుకు చెందిన 31 ఏళ్ల ఆటో డ్రైవర్ ఆర్థిక అవసరాలకు డబ్బు కోసం కిడ్నీని అమ్ముకున్నాడు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి విజయవాడలోని ఒక ఆసుపత్రి వైద్యులు అతని నుండి కిడ్నీ తీసుకున్నారు.

పోలీసులను ఆశ్రయించిన వ్యక్తి
ఆ తర్వాత డబ్బులు అడిగితే ఏడు నెలలపాటు తిప్పించుకొని తర్వాత లక్ష రూపాయలు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు. లోన్ యాప్ లో తీసుకున్న అప్పు చెల్లించడం కోసం కిడ్నీ అమ్ముకున్న సదరు ఆటోడ్రైవర్ లోన్ యాప్ వారి వేధింపులు భరించలేక, తన కిడ్నీ తీసుకున్నప్పటికీ తనకు డబ్బులు ఇవ్వకపోవడంతో తనకు జరిగిన మోసానికి గుంటూరు ఎస్పీని ఆశ్రయించాడు.

హోం మంత్రి సీరియస్
తనను ఏజెంట్లు మోసం చేశారని, మరోవైపు లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు పాల్పడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యాడు.ఇక విజయవాడలో జరిగిన కిడ్నీ రాకెట్ వ్యవహారంపై హోం మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ , విజయవాడ సీపీలతో ఆమె ఫోన్లో మాట్లాడారు. ఇలాంటి ఘటనలపై తక్షణం స్పందించాలన్నారు.

అధికారులకు హోం మంత్రి అనిత ఆదేశం
డబ్బులు ఆశ చూపి వ్యక్తి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రి పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కిడ్నీ రాకెట్ ను పట్టుకోవాలని ఆదేశించారు. పోలీసులు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి నిఘా పెట్టాలని సూచించారు. బాధిత ఆటోడ్రైవర్ ఫిర్యాదు పై హోం మంత్రి ఆదేశాలతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+