విజయసాయిరెడ్డి ట్వీట్లు.. శకునితో పోల్చిన హోం మంత్రి వంగలపూడి అనిత!

ఇటీవల కాలంలో మళ్లీ ఎక్స్ వేదికగా చంద్రబాబును లోకేష్ ను టార్గెట్ చేస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పైన ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయ సాయి రెడ్డి శకుని లాంటి వ్యక్తి అని ఆమె మండిపడ్డారు. ఆదివారం విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇదే సమయంలో విజయసాయి రెడ్డిపైన ఆమె తీవ్రవ్యాఖ్యలు చేశారు.

వైసీపీ పాపాలు బయటపడుతుంటే ఇలా ట్వీట్లు
వైసిపి పాపాలు బయట పడుతుంటే ఆ పార్టీ నేతల ట్వీట్లు పెరుగుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి పట్ల విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ఆమె పేర్కొన్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో అన్ని విషయాలు బయటకు వస్తున్నాయని, వైసీపీ నేతలు అందరిని బెదిరింపులకు గురి చేశారని హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.

home minister vangalapudi anitha slams vijayasai reddy tweets over chandrababu and pawan kalyan

ఏపీలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా మీద సిబిసిఐడి ద్వారా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్న హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత ఎక్కడ భూ అక్రమాలు జరిగినా అందులో వైసిపి నేతల పాత్ర ఉంటుందని పేర్కొన్నారు. ఏపీలో వైసీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు.

విజయసాయి రెడ్డి తాజా ట్వీట్ దుమారం
ఇక విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్టు పోస్ట్ లు పెడుతున్నాడని వంగలపూడి అనిత అసహనం వ్యక్తం చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖల అధికారులను టార్గెట్ చేస్తూ సీఎం చంద్రబాబు చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ తో సాయిరెడ్డిని శకుని అన్న అన్న వంగలపూడి అనిత
ఆ ట్వీట్ లో చంద్రబాబు డిప్యూటీ సీఎం విశ్వసనీయతను దెబ్బ తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబు తన కపట ట్రేడ్ మార్క్ రాజకీయ క్రీడలకు తిరిగి వచ్చాడని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఓ రకంగా లోకేష్ కోసం పవన్ క్రెడిబిలిటీ చంద్రబాబు దెబ్బ తీస్తున్నారు అనే విధంగా సాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నేపథ్యంలో విజయ సాయి రెడ్డిని శకునితో అభివర్ణిస్తూ వంగలపూడి అనిత ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+