క్రిమినల్ నాయకుడైతే.. జగన్ పై ఘాటుగా హోంమంత్రి వంగలపూడి అనిత

సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని పాపిరెడ్డి పల్లి లో దారుణ హత్యకు గురైన పార్టీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన జగన్ పర్యటన పైన శాఖ మంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు.నిన్నటి జగన్ టూర్ ఓ డ్రామాను తలపించిందని, ఏదో రకంగా శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని హోమ్ మంత్రి పేర్కొన్నారు.

కావాలనే సీన్ క్రియేట్ చేశారు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఐపిసి సెక్షన్ల ప్రకారం కాకుండా వైసిపి సెక్షన్ల ప్రకారం పోలీసులు వ్యవహరించారని గుర్తు చేశారు. జగన్ వెళ్లే ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం కావడంతో 1100మంది పోలీసులను పెట్టామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మాత్రమే భద్రత కట్టుదిట్టంగా చేశామని ఆమె పేర్కొన్నారు whatsapp లో రెచ్చగొట్టే మెసేజ్లు పెట్టి, కావాలని ఒక సీన్ క్రియేట్ చేయాలని చూశారని వంగలపూడి అనిత పేర్కొన్నారు.

Home Minister Vangalapudi Anitha slams ys Jagan over his serious comments on police

క్రిమినల్ నాయకుడిగా ఉంటే ఇలాగే ఉంటుంది
ఒక క్రిమినల్ నాయకుడిగా ఉంటే ఎలా ఉంటుందో నిన్న తెలిసిందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసిపి నేతలు కార్యకర్తలు హెలిపాడ్ దగ్గరకు కూడా తోసుకుంటూ నెట్టుకుంటూ వచ్చారని, దీంతో కొంతమంది పోలీసులకు గాయాలు అయ్యాయని వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఇంతా చేసి పోలీసులను తప్పుపడుతున్నారు అంటూ మండిపడ్డారు.

జగన్ మాట్లాడుతుంటే వైసీపీ అరాచక పాలన గుర్తొచ్చింది
12:42 కి రోడ్డు మార్గం కన్ఫర్మ్ అయిందని అయినప్పటికీ కొద్ది నిమిషాల్లోనే చాపర్ బయలుదేరి పోయిందని ఇదంతా క్రిమినల్ లీడర్ ప్రీ ప్లాన్ అంటూ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు.జగన్ ప్లాన్ చూసిన తర్వాత ఈ విధంగా కూడా ఆలోచిస్తారా అనిపించిందని ఆమె అన్నారు.జగన్ మాట్లాడుతుంటే వైసీపీ 5 ఏళ్ల జగన్ అరాచక పాలన గుర్తుకొచ్చిందని పేర్కొన్నారు.

Take a Poll

చంద్రబాబు పై విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన మర్చిపోతారా?
చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన జనాలు మర్చిపోలేదని అనిత గుర్తు చేశారు. ముసుగులేసుకుని కస్టోడీయల్ టార్చర్ ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. ఇక అటువంటి సంస్కృతి తమకు లేదని చెప్పారు . ఇప్పటి సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, హోంమంత్రి మీద అనేక కేసులు ఉన్నాయని ఇవన్నీ తమ ప్రశ్నించడం వల్ల పెట్టారని వంగలపూడి అనిత పేర్కొన్నారు.

జగన్ మారకపోతే వచ్చే ఎన్నికల్లో 11 కూడా రావు
ఖాకీ డ్రెస్సు Cmr నుంచి కొని తెచ్చుకోవడంతో వచ్చింది కాదని పేర్కొన్న హోం మంత్రి, అటువంటి ఖాకీ చొక్క ఊడదీస్తానని మాజీ సీఎం అనొచ్చా అంటూ ప్రశ్నించారు.
వైసీపీ హయాంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు 2800 పై చిలుకు హత్యలు జరిగాయని పేర్కొన్నారు. జగన్ చర్యలతోనే 151 నుంచి 11 కి దిగిపోయాడు అని తీవ్రంగా విమర్శించారు. జగన్ మారకపోతే భవిష్యత్తు ఎన్నికలలో అవి కూడా రావన్నారు.

జగన్ ను వదిలి చాపర్ వెళ్ళిపోవటంపై దర్యాప్తు చేస్తాం
వైసిపి నేతల తీరు మారకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు పెందుర్తి ట్రాఫిక్ అంశం పైన కూడా పోలీసుల తప్పులేదని, వైసిపి చేస్తున్న ప్రచారం అంతా అవాస్తవమని, అదంతా అబద్ధమని పేర్కొన్నారు. ఇక జగన్ ను వదిలి చాపర్ వెళ్ళిపోవడం పైన కూడా సమగ్ర దర్యాప్తు చేస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+