
ఎవరి వాదన వారిదే - తెగని పంచాయితీ : ఏపీ ఏకపక్షంగా విభజించింది..!!
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన అంశాలపై క్లారిటీ రాలేదు. పంచాయితీ తెగలేదు. రెండు రాష్ట్రాలు తమ వాదనలకే కట్టుబడి ఉన్నాయి. కేంద్ర హోం శాఖ నిర్వహించిన సమావేశంలో రెండు రాష్ట్రాల నుంచి హాజరైన అధికారులు ఎవరి వాదన వారు వినిపించారు. ముందుగా నిర్ణయించిన అయిదు అంశాల పైన ఈ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జెన్‌కో నుంచి తెలంగాణ విద్యుత్తు సంస్థలకు రూ.12,532 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని రాష్ట్ర అధికారులు ఆశిష్ కుమార్‌కు వివరించారు. అయితే.. తమకే తెలంగాణ జెన్‌కో రూ.3442 కోట్ల బకాయిలు ఇవ్వాల్సి ఉందని, వీటిని ఒకేసారి ఇప్పించేలా చూడాలని ఏపీ కోరింది.

ఏపీ కేసు విత్ డ్రా చేసుకుంటే
ఈ సమస్యను సాగదీయకుండా ఒకేసారి పరిష్కరించాలని తెలంగాణ అధికారులు కోరారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించగానే.. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు విద్యుత్తు సరఫరాను ఆకస్మికంగా నిలిపివేసిందని రాష్ట్ర అధికారులు వివరించారు. మ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి ఏపీలోని అనంతపూర్, కర్నూల్ జిల్లాలకు విద్యుత్తును సరఫరా చేశారని, దీని తాలూకు బకాయిలు కూడా రావాల్సి ఉందని తెలిపారు. ఇలాఅన్ని రకాలుగా తెలంగాణ విద్యుత్తు సంస్థలకు మొత్తం రూ. 12,532 కోట్ల బకాయిలు ఏపీ నుంచి రావాల్సి ఉం దని, దీనిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తాము లేవనెత్తుతున్న బకాయిల అంశాన్ని కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన బకాయిలపై కోర్టులో కేసు వేసిందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ పధకాలపైనా
ఏపీ
ప్రభుత్వం
హైకోర్టు
నుంచి
కేసును
ఉపసంహరించుకుంటే
రెండు
రాష్ట్రాల
విద్యుత్తు
బకాయిల
సమస్యను
సామరస్య
పూర్వకంగా
పరిష్కరించుకోవడానికి
తెలంగాణ
సిద్ధం
గా
ఉన్నట్టు
వెల్లడించారు.
ఉమ్మడి
రాష్ట్రంలో
అమలు
జరిగిన
కేంద్ర
ప్రభుత్వ
పథకాలకు
సంబంధించి
ఏపీ
నుంచి
తెలంగాణకు
రూ.495.21
కోట్లు
రావాల్సి
ఉందని
అధికారులు
వివరించారు.
ఏడేళ్లుగా
ఈ
బకాయిలను
చెల్లించట్లేదని
తెలిపారు.
హైకోర్టు,
రాజ్‌భవన్
వంటివాటిపై
చేసిన
రూ.315.76
కోట్ల
ఖర్చును
తెలంగాణకు
చెల్లిస్తామని
ఏపీ
అండర్‌టేకింగ్
కూడా
ఇచ్చిందని
పేర్కొన్నారు.
భవన
నిర్మాణ
కార్మికుల
సంక్షేమ
బోర్డుకు
సంబంధించి
రూ.464.39
కోట్లు,
నెట్
క్రెడిట్
కింద
మరో
రూ.208.24
కోట్లు
రావాల్సి
ఉందని
తెలంగాణ
అధికారులు
వివరించారు.

ఆ రెండు అంశాలపై న్యాయ సలహా
తెలంగాణ నుంచి ఎలాంటి అనుమతీ తీసుకోకుండానే .ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా విభజించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని ఆరోపించారు. విభజన సందర్భంలో కార్పొరేషన్ బోర్డు చేసిన తీర్మాన సమావేశంలో తమ రాష్ట్ర ప్రతినిధులు పాల్గొనలేదని తెలిపారు. సమావేశంలో ఇలా రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయలు వ్యక్తం చేస్తున్న సమయంలో..రాష్ట్ర విభజన నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా ఉన్న వివిధ వివాదాస్పద అంశాల్లో రెండు అంశాలపై న్యాయసలహా తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఉప సంఘం నిర్ణయించింది. రాష్ట్ర ఫైనాన్సు కార్పొరేషన్ విభజన అంశాన్ని కేంద్ర లీగల్ కౌన్సిల్‌కు నివేదించనున్నారు. రెండోది.. విద్యుత్తు బకాయిల అంశంలో ఆంధ్రప్రదేశ్ కోర్టుకు వెళ్లినందున ఇందులో కేంద్ర హోంశాఖ జోక్యానికి ఎంతవరకు ఆస్కారం ఉందో చర్చించి తేల్చాలని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.