వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాపుల‌కు 5 శాతం : బీసీ ఉపప్రణాళిక బిల్లుకు చట్టబద్ధత : కొద్ది సేపు ప్ర‌తిష్ఠంభ‌న‌..!

|
Google Oneindia TeluguNews

ఏపి అసెంబ్లీలో కీల‌క బిల్లుకు ఆమోదం ల‌భించింది. కాపుల‌కు అయిదు శాతం రిజ‌ర్వేష‌న్ వ‌ర్తింపు కు ఆమోద ముద్ర వేస్తూ..దానిలో మూడో వంతు మ‌హిళ‌ల‌కే ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించారు. అదే విధంగా బిసి ఉప ప్ర‌ణాళిక బిల్లులో కొంత ప్ర‌తిష్ఠంభ‌న ఏర్ప‌డినా...స్వ‌ల్ప మార్పుల‌తో ఉప ప్ర‌ణాళిక బిల్లుకు చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించారు.

కాపుల‌కు అయిదు శాతం రిజ‌ర్వేషన్లు..

కాపుల‌కు అయిదు శాతం రిజ‌ర్వేషన్లు..

ఎన్నిక‌ల వేళ కీల‌క‌మైన కాపు రిజ‌ర్వేష‌న్ల బిల్లుకు ఏపి ప్ర‌భుత్వం ఆమోద ముద్ర వేసింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కాపు, ఉప కులాలైన తెలగ, బలిజ, ఒంటరికి ఐదు శాతం; ఇతర ఆర్థికంగా వెనుకబడిన పేదలకు మరో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించే వేర్వేరు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. కాపులకు కేటాయించిన 5 శాతం రిజర్వేషన్లలో 1/3వ వంతును మహిళలకు కేటాయించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. బీసీలకు నష్టం లేకుం డా కాపులకు రిజర్వేషన్‌ కల్పించేందుకు వీలుగా 2017 డిసెంబరులో శాసనసభ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపగా ఇప్పటివరకు పట్టించుకోలేదనని మంత్రి అచ్చంనాయుడు వివ‌రించారు. కేంద్రం ఐదారుసార్లు కొర్రీలు వేసి నప్పటికీ అధికారులు సమాధానం ఇచ్చారని తెలిపారు. అయినా ఫలితం కనిపించకపోవడంతో కేంద్రం 103వ రాజ్యాం గ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించిందన్నారు.

బీసీ ఉప ప్ర‌ణాళిక‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త‌..

బీసీ ఉప ప్ర‌ణాళిక‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త‌..

బీసీ ఉపప్రణాళికకు చట్టబద్ధత కల్పించే బిల్లును రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని ప్రకారం రాష్ట్ర బడ్జెట్‌లోని ప్రణాళికా కేటాయింపుల్లో మూడింట ఒక వంతు బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం వెచ్చించనుంది. బిల్లును బీసీ సంక్షేమ మంత్రి కె.అచ్చెన్నాయుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లు అస్పష్టంగా ఉందని ప్రభుత్వ విప్‌ కూన రవికుమార్‌ అభ్యంతరం తెలపడం, దీనిపై మంత్రి వద్ద సరైన సమాధానం లేకపోవడంతో సభలో కాసేపు ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో లేరు. విషయం తెలుసుకున్న ఆయన అధికారులను తన ఛాంబర్‌కు పిలిపించి మాట్లాడారు. చివరకు బిల్లులో మార్పులు చేసి సభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. అచ్చె న్నాయుడు మొదట ప్రవేశపెట్టిన బిల్లులో... బీసీ ఉపప్రణాళిక కింద ప్రణాళికా వ్యయంలో కొంత మొత్తాన్ని కేటాయిస్తా మనే పేర్కొన్నారు. బీసీలకు ఎంత కేటాయిస్తారు.. ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారో బిల్లులో స్పష్టంగా లేదని రవికుమార్‌ అభ్యంతరం తెలిపారు. దీనిపై వాదోపవాదాలు కొనసాగాయి. ఈ చర్చ కొనసాగుతుండగానే మంత్రి కాలవ శ్రీనివాసులు, కూన రవికుమార్‌, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి తన ఛాంబర్‌లోకి పిలిపించి బీసీ ఉపప్రణాళికకు నిధుల కేటాయింపుపై చర్చించారు. రాజకీయ రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికా కేటాయింపుల్లో 33 శాతాన్ని ఖరారు చేయాలని నిర్ణయించారు. ఆ ప్రకారం బిల్లులో మార్పు చేసి సభ ఆమోదించింది.

ప్ర‌తిష్ఠంభ‌న‌..చ‌ట్ట బ‌ద్ద‌త‌పై అనుమానం..

ప్ర‌తిష్ఠంభ‌న‌..చ‌ట్ట బ‌ద్ద‌త‌పై అనుమానం..

బీసీ ఉప ప్ర‌ణాళిక‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త పై స‌భ‌లో చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో విప్ కాల్వ శ్రీనివాసులు ప‌దే ప‌దే ప్ర‌శ్నిం చ‌టంతో..ఓ దశలో మంత్రి అచ్చెన్నాయుడు రవికుమార్‌ను ఉద్దేశించి తెలివి ఎక్కువై మాట్లాడుతున్నారని వ్యాఖ్యా నించారు. రవికుమార్‌ పేర్కొన్న అంశాలపై స్పష్టతనివ్వాలని మరో సభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ కూడా అన్నారు. అచ్చెన్నాయుడు సరైన సమాధానాలే ఇస్తున్నారని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. భాజపా పక్ష నేత విష్ణుకుమార్‌ జోక్యం చేసుకుని సభ్యుల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. సభాపతి కోడెల జోక్యం చేసుకుని.. సభ్యుల సూచనల మేరకు బిల్లులో స్పష్టతనివ్వాల్సి ఉందన్నారు. ఇక‌, ఇదే విధంగా కాపు రిజ‌ర్వేష‌న్ బిల్లు అమోదం స‌మ‌యంలోనూ దీనికి చ‌ట్ట‌బ‌ద్ద‌త పై బిజెపి స‌భ్యులు అనుమానం వ్య‌క్తం చేసారు.

English summary
AP Assembly Accepts five percent reservations for kapus and BC Sub plan. These two important bills passed in one day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X