హాస్టల్ మూడో అంతస్థు నుంచి దూకి హౌస్ సర్జన్ ఆత్మహత్య
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గల ఆశ్రమ ఆస్పత్రిలో హౌస్ సర్జన్ బలభద్ర రితేష్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం రేపింది. అతను ఆస్పత్రి హాస్టల్ భవనం మూడో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగింది.
పోలీసులు గురువారం తెల్లవారు జామున ఆస్పత్రికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. రితేష్ కాకినాడకు చెందిన డాక్టర్ వెంకటరాజు కుమారుడు. రితేష్ తల్లిదండ్రులు ఇరువురు కూడా వైద్యులే. రితేష్ ఆత్మహత్యకు కారణాలేమిటనేది తెలియదు.

నిజానికి ఒకటి, రెండు నెలల్లో హౌస్ సర్జన్ కూడా పూర్తయి డాక్టర్ డిగ్రీ పుచ్చుకునే స్థితిలో 23 ఏళ్ల రితేష్ ఆత్మహత్య చేసుకోవడం అందరినీ ఆశ్చరపరుస్తోంది. బుధవారం కాలేజీలో జరిగిన స్పోర్ట్స్ మీట్‌కు కూడా రితేష్ హాజరు కాలేదు.
గురువారం నాలుగు గంటల నుంచి రితేష్ ఎవరికీ కనిపించలేదని అంటున్నారు. తల్లిదండ్రులు ఏలూరు చేరుకున్నారు. రితేష్ మానసికంగా నిలకడగా ఉండేవాడని అంటున్నారు.












Click it and Unblock the Notifications