అప్పు ఇస్తానని ఆశపెట్టి వివాహితపై గ్యాంగ్ రేప్

House wife raped in Nizamabad district
నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లికి చెందిన ఓ వివాహితపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకోగా విషయం బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.

సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి - అర్సపల్లి భగత్‌సింగ్‌కాలనీలో 35సంవత్సరాల వివాహిత తన భర్తతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇందులో భాగంగానే గత 15రోజుల క్రితం నగరంలో షాపింగ్‌కు వచ్చింది. ఆర్మూర్‌కు చెందిన సాధిక్ అనే ఫైనాన్స్ వ్యాపారితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నానని, ఏమైనా డబ్బులు అవసరం ఉంటే తనకు ఫోన్ చేయాలని అతను ఆమెకు చెప్పాడు.

దీంతో మంగళవారం సాధిక్‌కు ఆమె ఫోన్ చేసి నిజామాబాద్‌కు పిలిచింది. సాధిక్‌తో పాటు అతని స్నేహితుడు ఇద్దరు కలిసి మంగళవారం సాయంత్రం కారులో భగత్‌సింగ్‌కాలనీకి చేరుకున్నారు. అప్పటికే అక్కడ సదరు మహిళతో పాటుగా మరో మహిళ కూడా ఉంది. వారు అక్కడికి చేరుకున్నాక డబ్బులు కావాలని అడిగారు. ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేవని, తనతో వస్తే ఇస్తానని సాధిక్ ఆమెకు వివరించాడు. దీంతో మహిళ వారి వెంట ఒంటరిగా వెళ్లగా, మరో మహిళ అక్కడి నుండి వెళ్లిపోయింది.

అనంతరం ఇద్దరు కలిసి ఆమెను కారులో అర్సపల్లి బైపాస్ రోడ్డులోని నిర్మాష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై ఇద్దరు కలిసి రెండుసార్లు అత్యాచారం చేసి అక్కడి నుండి పారిపోయారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెకు మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో సృహలోకి రాగా రోడ్డుపైకి నడుచుకుంటు వచ్చి స్థానికుల సహయంతో పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+