వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపితో పొత్తెలా?: బిజెపిపై హరీష్, ఇష్టం లేదు: ఈటెల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవడం ఆత్మహత్యా సదృశ్యమేనని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు అన్నారు. తెలంగాణకు అనుకూలమని చెబుతున్న బిజెపి, రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరిస్తున్న టిడిపితో ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. సీమాంధ్ర పార్టీల నేతలు ఎన్ని కుట్రలకు పాల్పడినా నెలన్నర రోజుల్లో తెలంగాణ రాష్ట్రం రావడం ఖాయమన్నారు.

తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు చోటులేదన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈ సమయంలో ముఖ్యమంత్రిగా ఉంటే ప్రత్యేక రాష్ట్ర ముసాయిదా బిల్లు ఈపాటికే రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లేదన్నారు. ప్రస్తుతం శాసనసభ, మండలిలో సభా నాయకులు, స్పీకర్, చైర్మన్ అంతా ఆంధ్రావారేనని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చర్చ ప్రారంభించామని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించినా చర్చే జరగలేదంటున్న ముఖ్యమంత్రి తీరు చెవిటోని ముందు శంఖం ఊదినట్లు ఉందన్నారు.

విలీనం ఇష్టం లేదు: ఈటెల

కాంగ్రెస్‌లో తెరాస విలీనానికి తెలంగాణ ప్రజలు ఇష్టపడట్లేదని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ వేరుగా అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లాలో వి లేకరులతో మాట్లాడారు. కెసిఆర్ కృషి వలనే కాంగ్రెస్ పార్టీ దిగివచ్చి తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టిందన్నారు.

కాంగ్రెస్‌లో తెరాస విలీనం చేయకపోవడం వల్లనే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం అవుతోందంటూ ఎర్రబెల్లి వ్యాఖ్యానించడం సమంజసం కాదని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కెసిఆర్ సారథ్యంలోని తెరాసతోనే సాధ్యమని తెలంగాణవాదులంతా ప్రగాఢంగా నమ్ముతున్నందున తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రసక్తే లేదని నాయిని నర్సింహా రెడ్డి హైదరాబాదులో అన్నారు.

English summary
Telangana Rastra Samithi Siddipet MLA Harish Rao on Sunday questioned how BJP will alloy with Telugudesam Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X