‘నా అనుచరుడిని అరెస్టు చేస్తారా?’ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వీరంగం!

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: అనంతపురం మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడైన మడ్డిపల్లి శివనాయుడు ఫోన్ చేసి బెదిరించారు. ఈ మేరకు స్వరూప, ప్రభాకర్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై నగర మేయర్ స్వరూప నిన్న తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ విమర్శల నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు శివనాయుడు ఫోన్ చేసి ఎమ్మెల్యే, మేయర్‌ను బెదిరించారు.

jc-prabhakar-reddy

మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడిపత్రి పోలీసులు శివ నాయుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలియగానే ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

'నా అనుచరుడ్ని అరెస్ట్ చేస్తారా' అంటూ ఆగ్రహావేశాలతో పోలీస్ స్టేషన్‌లో వీరంగం సృష్టించారు. ఈ విషయమై తాడిపత్రి సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ.. శివనాయుడిని అరెస్టు చేసిన మాట వాస్తవమేనని, కానీ స్టేషన్ బెయిల్ పై ఆయన్ని విడుదల చేశామని చెప్పారు.

  JC ready to resign as Lok Sabha MP ఎంపీగా ఫెయిలయ్యా, రాజీనామా చేస్తున్నా | Oneindia Telugu

  అయితే జేసీ వర్గం ఊరుకోలేదు. గతంలో జేసీ సోదరులపై మేయర్ స్వరూప డ్రైవర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అతన్ని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తాడిపత్రి పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Anantapur MLa JC Prabhakar Reddy rushed Tadipatri Police Station on Thursday after knowing that police arrested his follower Siva Naidu. Maddipalli Shiva Naidu threatened Anantapur Mayor Swaroopa and MLA Prabhakar Chowdary over phone. So JC Prabhakar went to police station and expressed his agner on police officials regarding arrest of his follower.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X