• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం...ఇకముందు ఇలాగేనా?

|

జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవలి ఒక్క మీటింగ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సుడిగాలిలో చుట్టేసి పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే...ఆ మీటింగ్ పర్యవసానంగా చెలరేగిన పొలిటికల్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్న పరిస్థితి.

ఎపి పాలిటిక్స్ లో ఇంతటి పెను మార్పుకు కారణమైన పవన్ కళ్యాణ్ ప్రస్తుత పరిస్థితి ఏమిటి?...ఈ మీటింగ్ తరువాత ఆయన ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంటున్నారు?...ఆ మీటింగ్ తరువాత రాజకీయంగా వ్యక్తిగతంగా ఆయన జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించాయి?...ఈ పరిస్థితులను ఆయన ఎలా ఎదుర్కొనే అవకాశం ఉంది అనే విషయాలపై రాజకీయ పరిశీలకుల విశ్లేషణ మీకోసం...

ఆవిర్భావ సభలో...సంచలనాలు ఆవిష్కృతం

ఆవిర్భావ సభలో...సంచలనాలు ఆవిష్కృతం

మార్చి 14 న జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సభలో అనూహ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా ఇటీవలి ఎపి రాజకీయాల్లో అతి పెద్ద కుదుపుకు పవన్ కణ్యాణ్ కారణభూతుడైన సంగతి తెలిసిందే. ఆ సభలోనే ఆయన వైసిపి, బిజెపి ల మీద కూడా విమర్శలు చేసినా టిడిపిపై ఆయనే చేసిన విమర్శలే పెను సంచలనంగా మారాయి. తాజా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. అంతేకాదు ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులకు నాంది పలికి రోజుల వ్యవధిలోనే అనేక కీలక పరిణామాలు చకచకా సాగిపోయేలా చేశాయి.

ఆ తరువాత...ఏం జరిగింది...

ఆ తరువాత...ఏం జరిగింది...

పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభ జరిగి నేటికి 17 రోజులు...ఆ సభ జరిగి పక్షం రోజులు పైబడిన సందర్భంలో ఎపి రాజకీయాలను ఇంతగా ఊపేసిన పవన్ కల్యాణ్ కు సంబంధించి ఆ సభకు ముందు...ఆ తరువాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారనేది ఆసక్తికరమే. అయితే సహజంగా అంతర్ముఖుడైన పవన్ ఆ విషయాలను తనంతట తానుగా బైటపెట్టే అవకాశం లేనందున తాజా రాజకీయ,సామాజిక పరిస్థితులను బట్టి ఆయన ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు... ఎదుర్కొనే అవకాశం ఉంటుందనే విషయమై రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ముందుగా టిడిపి...సహకార నిరాకరణ...

ముందుగా టిడిపి...సహకార నిరాకరణ...

ముందుగా ఈ సభ ద్వారా ఊహించని దెబ్బ తిన్న టిడిపి విషయమే తీసుకుంటే పవన్ చర్యతో దిగ్బ్రాంతికి గురైన తెలుగుదేశం పార్టీ ఆ మరుక్షణం నుంచే ఎదురుదాడి మొదలుపెట్టింది. అంతేకాదు అతనికి అప్పటివరకూ తమ పార్టీ వర్గాల ద్వారా పరోక్షంగా అందుతున్న అన్ని రకాల సహాయ సహకారాలను నిలిపివేసింది. అసలు ఆవిర్భావ సభకు అంత భారీ సంఖ్యలో జనం తరలి రావడానికి పలు జిల్లాల టిడిపి నేతలే వాహనాలు సమకూర్చారనే టాక్ కూడా ఉంది. అయితే ఆ సభలో పవన్ అనూహ్య ధోరణితో ఖంగుతిన్న టిడిపి శ్రేణులు పవన్ పై ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నారు. అందుకే ముందుగా పార్టీ నుంచి సహాయ సహకారాలు, ఆ తరువాత టిడిపి అనుకూల మీడియా చే పవన్ పై అనధికార బహిష్కరణ, ఆ తదుపరి సినీ ఇండస్ట్రీలో వివక్ష, ఆ తరువాత రాజకీయంగా వంటరిని చేయడం...ఇవన్నీ ప్రయోగించడం మొదలుపెట్టారు.

 ఎదురుదాడి ఊహించారు...కానీ

ఎదురుదాడి ఊహించారు...కానీ

ఆ సభ తరువాత టిడిపి తనపై ఎదురుదాడి చేస్తుందని, టార్గెట్ చేస్తుందని పవన్ ఊహించారు...కానీ వాస్తవరూపంలో వాటి తాకిడిని తీడియీా ట్టుకోవడం

ఆయనకు కష్టంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా మీడియా నుంచి సహకారం తగ్గుతుందని అయితే ఊహించారు కాని ఏకంగా ఒక్కసారే బహిష్కరించినంత పరిస్థితి ఉంటుందని మాత్రం ఊహించలేదట. అంతకుముందు పవన్ అడుగుతీసి అడుగేస్తే హోరెత్తించిన మీడియా ఇప్పడు పవన్ అతి ముఖ్యమైన మీటింగ్ ల కవరేజీకి కూడా ఆసక్తి చూపడం లేదట...స్వయంగా పవన్ హాజరయ్యే మీటింగ్ లకైనా సరే తప్పదన్నట్లుగా రావడం...అక్కడ కూడా టార్గెట్ చేసే కార్యక్రమమే జరుగుతుండటం...ఈ పరిణామాలను ఎదుర్కోవడం పూల వర్షం కురిపించిన చోటే రాళ్ల దెబ్బలు తింటున్నట్లుగా ఉందట.

 ఇక సినీ పరిశ్రమలోనూ...పవన్ కు చెక్ చెప్పేందుకు

ఇక సినీ పరిశ్రమలోనూ...పవన్ కు చెక్ చెప్పేందుకు

ఇక సినీ పరిశ్రమలోనూ పవన్ కు చెక్ చెప్పేందుకు ఆ పరిశ్రమలో తమకున్న ప్రాబల్యం ద్వారా టిడిపి వ్యూహరచన చేస్తోందట. ఇప్పటికే పరిశ్రమలో పవన్ ను వ్యతిరేకించే వారినందరిని ఏకతాటి మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారట. అలాగే పవన్ విషయంలోనే సినీ పరిశ్రమ రెండు ముఖ్య భాగాలుగా చీలిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఒక సామాజిక వర్గం వారికి తెలుగు సినీ పరిశ్రమపై గట్టి పట్టు ఉన్నా గతంతో పోలిస్తే ఇప్పుడు ఏకచక్రాధిపత్యం వహించే రోజులు లేవట. సినీ పరిశ్రమకు సంబంధించి టిడిపి ఎత్తులను ధీటుగానే ఎదుర్కొనేందుకు పవన్ కు లోపాయికారిగా చాలామందే మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఉందంటున్నారు.

 ఇక రాజకీయంగా...ఒంటరిని చేసేందుకు...

ఇక రాజకీయంగా...ఒంటరిని చేసేందుకు...

ఇక పవన్ ను రాజకీయంగా ఒంటరిని చేసేందుకు...తమని పొలిటికల్ గా డ్యామేజ్ చేసిన పవన్ పై రివెంజ్ తీర్చుకునేందుకు టిడిపి పెద్ద స్కెచ్చే వేస్తోందట. ఇందుకోసం ఎంత రిస్క్ అయినా, ఖర్చయినా ఫరవాలేదని టిడిపి భావిస్తోందట. అందులో భాగంగానే టిడిపి నేతలు పవన్ రాజకీయ ప్రస్థానాన్ని ఈసడిస్తున్న టైప్ లో మాట్లాడుతుండగా...మరోవైపు అసలు పవన్ రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారేలా చేయాలని ఆ పార్టీ నేతల్లో కొందరు గట్టి పట్టుదలతో ఉన్నారట.

ఆ క్రమంలోనే ఇటీవల కీలక సమయంలో టిడిపి అనుకూల వాయిస్ వినిపిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జెపి సైతం పవన్ పై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పవన్ జెఎప్సి పేరుతో హడావుడి చేసి ఆ తరువాత పట్టించుకోవడం లేదని, జాయింట్ ఫ్యాక్ట్ కమిటీ చేసిన సూచనలు ముందుకు తీసుకువెళ్లడంలో పవన్ విఫలం అయ్యారంటూ జెపి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అందుకోసం తాను మరొకమిటీ వేసి నిజం తెలుస్తాననడమే కాదు ఆ దిశలో వెనువెంటనే చర్యలు కూడా ప్రారంభించారు.

 జెపి ఆరోపణలపై...పరిపక్వతతో స్పందించిన పవన్...

జెపి ఆరోపణలపై...పరిపక్వతతో స్పందించిన పవన్...

అయితే జెపి విమర్శలపై ఊహించని రీతిలో పవన్ ట్విట్టర్ లో స్పందించారు. డాక్టర్ జయప్రకాశ్ నారాయణ మరో కమిటీ ఏర్పాటు చేయడాన్ని తాను స్వాగతిస్తున్నానని ప్రకటించారు. రాష్ట్రంకు మేలు జరిగేపని ఎవరు చేసినా మంచిదేననే తరహాలో పవన్ స్పందించారు. అయితే పవన్ నుంచి ఈ తరహా స్పందన అటు జెపి గాని ఇటు టిడిపి గాని అసలు ఊహించలేదని తెలుస్తోంది. మరోవైపు గతంలో పవన్ రాజకీయపు అడుగులు తన సొంత ఆలోచనలతోనో...ప్రత్యేకంగా తనకు అందచేయబడిన సూచనల మేరకో ఉండేవని, ఇప్పుడయితే పవన్ కు రాజకీయ సలహాదారులు చాలామంది ఏర్పడినట్లు తెలుస్తోంది. అలాగే ఇకముందు తన రాజకీయ ప్రస్థానంలో ఎదురయ్యే ఒడిదుడుకుల గురించి గడచిన 15 రోజుల్లో ఒక అవగాహనకు వచ్చిన పవన్ ఇకపై మరింత వ్యహాత్మకంగా ముందుకు దూసుకెళ్లాలనే మంత్రాంగం నెరుపుతున్నట్లు సమాచారం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena founder& president Pawan Kalyan responded over JP's comments of Pawan neglecting over Joint Fact-Finding Committee. Pawan took to Twitter and posted comments in which he said: I respect & welcome Loksatta’s ’Sri Jaya Prakash Garu’s’ initiative to continue the spirit of JFC with an independent committee comprises of a team of Public policy experts to probe more deeper into AP Bifurcation act & on issue of Spl. Category Status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more