Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాంగోపాల్ వర్మ ట్వీట్ల అసలు మర్మం అదే ! టీడీపీ-జనసేన పొత్తుకు మరణశాసనం..?

ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల్ని కూడగట్టే పనిలో ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ ను, వైసీపీ స్ధానంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబును టాలీవుడ్ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ తాజా ట్వీట్లు అసహనానికి గురి చేస్తున్నాయి. వీరిద్దరి సామాజిక వర్గాలైన కాపు, కమ్మ మధ్య పాత గొడవలతో కొత్త వివాదాలు నెలకొనేలా చేస్తున్న వర్మ ట్వీట్లపై ఇప్పటికే ఈ రెండు వర్గాలు మండిపడుతున్నాయి. అంతిమంగా టీడీపీ-జనసేన పొత్తు ఆలోచనల్ని విఫలం చేసేలా ఈ ట్వీట్లు ఉంటున్నాయన్న ప్రచారం మొదలైంది.

రాంగోపాల్ వర్మ పొలిటికల్ సినిమాలు


ఒకప్పుడు టాలీవుడ్ తో తన సినీ కెరీర్ ను మొదలుపెట్టి అనంతరం బాలీవుడ్ కు కూడా వెళ్లి నిరూపించుకుని అగ్రదర్శకుల్లో ఒకడిగా మారిన రాంగోపాల్ వర్మ... గత కొంతకాలంగా తన సినిమాల్ని గతంలోలా తన ప్రతిభను నిరూపించుకోవడానికి కంటే.. ఏపీలో ఓ వర్గాన్ని టార్గెట్ చేసుకోవడానికే ఎక్కువగా వాడుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆయన మరో సామాజిక వర్గాన్ని కూడా కెలికారు. ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో ఆయన సినిమా అమ్మరాజ్యంలో కడప రెడ్లు ఎంతటి రచ్చకు కారణమైందో అంతా చూశారు. గతంలో వంగవీటి వంటి సినిమాతో కాపు సామాజిక వర్గాన్ని, అమ్మ రాజ్యంలో కడప రెడ్లు వంటి సినిమాతో కమ్మ సామాజిక వర్గాన్ని, చంద్రబాబు, లోకేష్ ను, పవర్ స్టార్ పేరుతో ఓ సినిమా తీసి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన రాంగోపాల్ వర్మ ఉద్దేశమేంటో అప్పుడే అర్ధమైంది.

రాంగోపాల్ వర్మ ట్వీట్లు

గతంలో టీడీపీ, జనసేన, కాపు, కమ్మ సామాజిక వర్గాల్ని టార్గెట్ చేస్తూ పలు సినిమాలు తీసి వైసీపీకి మేలు చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న రాంగోపాల్ వర్మ.. తాజాగా మరోసారి ట్వీట్లతో రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు కమ్మ, కాపు సామాజిక వర్గాల్ని కెలుకుతూ వర్మ నిత్యం ట్వీట్లు పెడుతున్నారు. వాటికి స్పందించి టీడీపీ, జనసేన నేతలు స్పందిస్తుంటే ఎప్పటికప్పుడు వాటికి కౌంటర్లు వేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు సడన్ గా వర్మ ఎందుకు ఇలా రెండు సామాజిక వర్గాల్ని టార్గెట్ చేస్తూ ఇలా రెచ్చిపోతున్నారన్న దానిపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

టీడీపీ-జనసేన పొత్తు చెడగొట్టేలా ?

రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీకి వ్యతిరేకంగా మరోసారి జత కలిసేందుకు టీడీపీ-జనసేన పార్టీలు సిద్దమవుతున్నాయి. విశాఖలో చోటు చేసుకున్న పరిణామాల తర్వాత ఈ రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు-పవన్ కళ్యాణ్ ఇప్పటికే రెండుసార్లు కలిశారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై చర్చించారు. భవిష్యత్తులో కలిసి పనిచేద్దామనే నిర్ణయానికి వచ్చేశారు. త్వరలో వీరిద్దరూ అధికారికంగా టీడీపీ-జనసేన పొత్తును ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కమ్మ, కాపు సామాజిక వర్గాల్ని విడివిడిగా, కలివిడిగా టార్గెట్ చేస్తూ వర్మ పెడుతున్న ట్వీట్లపై ఆయా సామాజిక వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీడీపీ-జనసేన పొత్తు కుదరకుండా చేసేందుకు వర్మ ఇలాంటి పిచ్చిపనులు చేస్తున్నారని వారు మండిపడుతున్నారు.

వైసీపీకి మేలు చేస్తున్న వర్మ ?

టీడీపీ, జనసేన పార్టీలపైనా, వాటి అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పైనా, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న కమ్మ, కాపు సామాజిక వర్గాలపైనా ట్వీట్లు పెడుతున్న రాంగోపాల్ వర్మ.. వైసీపీపైనా, సీఎం జగన్ పైనా ఎక్కడా మాట్లాడటం లేదు. మాట్లాడినా పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. ఈ మూడున్నరేళ్లలో పలు ట్వీట్లు పెట్టినా టీడీపీ, జనసేన పార్టీల్ని ఇంతగా టార్గెట్ చేసిన దాఖలాలు లేవు. ఇదంతూ చూస్తుంటే కమ్మ, కాపు సామాజిక వర్గాల్ని రెచ్చగొట్టి టీడీపీ-జనసేన పొత్తు కుదరకుండా చేసి అంతిమంగా వైసీపీకి మేలు చేసే ప్రయత్నాల్లో భాగంగానే వర్మ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+