రైల్వేలో ఈ ఒక్కటి చేయండి.. అది మీదే అవుతుంది..
రైలులో లోయర్ బెర్త్ దొరికితే కిటికీ పక్కనే కూర్చొని ప్రయాణాన్ని మధురమైన అనుభూతిగా మార్చుకోవచ్చు. కిటికీ పక్కనే కూర్చుంటాం. నిద్ర పోవాలంటే పైకెక్కాల్సిన అవసరం లేదు. అందుకే అందరూ మొదటి ప్రాధాన్యత కింద లోయర్ బెర్త్ ను ఎంపిక చేసుకుంటారు. టికెట్ బుక్ చేసుకునే సమయంలో లోయర్ బెర్త్ ప్రిఫరెన్స్ పెడతారు. తక్కువ మందికే అవకాశం దొరుకుతుంటుంది. అయితే
సీనియర్ సిటిజన్ కోటాలో లోయర్ బెర్త్ బుక్ చేసుకోవచ్చు. అన్ని రైళ్లల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఒక్కో బోగీలో 6 బెర్తులు కేటాయిస్తారు. స్లీపర్ లో 6, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీల్లో మూడు చొప్పున బెర్తులు అందుబాటులో ఉంటాయి. నలుగురు లేదా ఆరుగురు కలిసి ప్రయాణం చేసే సమయంలో అందులో పెద్దవారికి లోయర్ బెర్త్ కేటాయిస్తారు. టికెట్లు బుక్ చేసుకునే సమయంలో వయసు ప్రకారం బెర్త్ ల కేటాయింపు ఫీడ్ అయివుంటుంది. లోయర్ బెర్త్ ఇద్దరికి రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. వయసు కారణంగా మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్ ఎక్కలేకపోతే రైలులో ఉండే టీటీఈను సంప్రదిస్తే వేరే బెర్త్ కేటాయిస్తారు. అయితే అది అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. అందుకే ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

పురుషులైతే 60 సంవత్సరాలు, స్త్రీలైతే 45 సంవత్సరాలు దాటితే రైల్వే వారిని సీనియర్ సిటిజన్లుగా పరిగణించి లోయర్ బెర్త్ ను కేటాయిస్తుంది. రైల్వేకు సంబంధించిన టికెట్ కౌంటర్లలో టికెట్లు బుక్ చేసుకునే సమయంలోనే వర్తిస్తుంది. ఒక పీఎన్ఆర్ నెంబరుపై ఇద్దరికి మాత్రమే సీనియర్ సిటిజన్ కోటా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతకుమించి వారిని జనరల్ కోటాగా పరిగణిస్తారు. పెద్దవారితో ప్రయాణించే సమయంలో సీనియర్ సిటిజన్ కోటా ఉపయోగించుకోవాలి. అప్పుడు లోయర్ బెర్త్ వస్తుంది.. మిగతావారికి అటో ఇటో దగ్గరలోనే వస్తాయి.












Click it and Unblock the Notifications