దయచేసి ఈ రైలుకు మాత్రం టికెట్లు బుక్ చేసుకోవద్దు.. ఎక్కొద్దు?
పేరుకే కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు అయినప్పటికీ ప్యాసింజర్ రైళ్లకంటే ఘోరంగా ప్రతి స్టేషన్ లో ఆగుతూ వెళుతుంటాయి. ఆ సమయంలో ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం అంటే ఏమిటో అర్థమవుతుంటుంది. టికెట్ తీసుకొని ఎక్కాం కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటిదే ఒక రైలుంది. దీన్ని గురించి తెలుసుకుంటే అసలు అందులో టికెట్ బుక్ చేసుకోరు.
పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్ వరకు ఈ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణిస్తుంది. బెంగాల్, జార్ఖండ్, బీహార్, యూపి, హర్యానా మీదుగా పంజాబ్ చేరుకుంటుంది. హౌరా నుండి అమృత్‌సర్ వరకు 2005 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి దాదాపు 37 గంటల సమయం పడుతుంది. ఇది ఒకటి కాదు.. రెండుకాదు.. ఏకంగా 111 స్టేషన్లలో ఆగుతుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం వాస్తవం. హౌరా-అమృత్ సర్ మెయిల్ ఎక్స్ ప్రెస్. పేరుకే ఇది ఎక్స్ ప్రెస్ రైలుకానీ ప్యాసింజర్ రైలుకన్నా ఘోరంగా వెళుతుంటుంది.

ఈ రైలులో స్లీపర్ క్లాస్ రూ.735, థర్డ్ ఏసీ రూ.1950, సెకండ్ ఏసీ రూ.2835 గా ఉంది. ఫస్ట్ క్లాస్ ఏసీకి రూ.4835 అవుతుంది. ఇందులో ప్రయాణించడం ప్రయాణికులకు అగ్నిపరీక్ష లాంటిదే. దారిపొడవునా 111 స్టేషన్లలో ఆగుతూ ప్రయాణం చేస్తుంటే ఎవరికైనా కోపం నషాళానికి అంటుతుంది. ఎక్కిన తర్వాత అనుకన్న గమ్యాన్ని చేరుకోవాలి కాబట్టి ఓపికగా ఉండాలి. అంతకుమించి రైలు ఎక్కిన తర్వాత చేసేదేమీ ఉండదు. అందుకే సాధ్యమైనంతవరకు ఈ తరహా రైళ్లల్లో ప్రయాణం చేయకుండా ఉంటేనే ఉత్తమం అనిపిస్తుంటుంది.












Click it and Unblock the Notifications