వెంకన్నకు ఆర్ఎస్ బ్రదర్స్ భారీ విరాళం..

Subscribe to Oneindia Telugu

తిరుపతి : భక్తుల పరంగానే కాదు, కానుకలు అందుకోవడంలోను తిరుమల తిరుప‌తి వెంక‌టేశ్వర దేవస్థానం ఎప్పుడూ టాప్ లోనే ఉంటుంది. భక్తులతో పాటు, ఆయా సంస్థల నుంచి పెద్ద మొత్తంలో వచ్చే నగదు, బంగారం వంటి కానుకలతో దేవస్థానం వార్తల్లోకి ఎక్కడం తరుచూ జరుగుతున్నదే.

తాజాగా తిరుమల తిరుప‌తి వెంక‌టేశ్వర దేవస్థానానికి ప్రముఖ వ‌స్త్ర వ్యాపార సంస్థ ఆర్‌ఎస్‌ బ్రదర్స్ రూ.1.20 కోట్ల విరాళాన్ని అందించింది. ఈ నగదును డీడీల రూపంలో టీడీడీ అధ్య‌క్షుడు చద‌ల‌వాడ కృష్ణ‌మూర్తికి అందించింది ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యం.

Huge Donation of RS BROTHERS to TTD

కాగా.. ఆర్ఎస్ బ్రదర్స్ నుంచి అందిన ఈ భారీ విరాళంలో, టీటీడీ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోన్న నిత్య అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి, అలాగే ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.10లక్షలు, గోసంరక్షణ ట్రస్టుకు రూ.10లక్షలు ఉప‌యోగించనున్నారు.

భారీ విరాళాన్ని శ్రీవారికి సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యం.. తమ సంస్థ నుంచి ప్రతీ ఏటా కోటి రూపాయ‌ల‌కు పైగా విరాళాన్ని తిరుమల వేంకటేశ్వరస్వామికి అందిస్తున్నట్టుగా వెల్లడించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The famous textile company RS Brothers donated huge amount of money to TTD approximately Rs.1.20 crores. The DDs of donation will submited to TTD chairman Chadalavada Krishnamurthy

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X