బద్వేల్‌లో భారీ అగ్ని ప్రమాదం: వందలాది గుడిసెలు దగ్ధం, మంటల్లో చిక్కుకున్న కొందరు?

Subscribe to Oneindia Telugu

కడప: జిల్లాలోని బద్వేలులో గురువారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాలిటెక్నిక్ కాలేజీ వెనుకాల ఉన్న గుడిసెలు మంటల్లో దగ్ధమయ్యాయి. సుమారు 900 గడిసెలు కాలిపోయాయి.

మంటల్లో కొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశాయి. నాలుగు ఫైరింజినట్లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

huge fire accident in badvel

మంటలు తీవ్రంగా ఉండటంతో ఫైరింజిన్లు వెంటనే మంటలను అదుపుచేయలేకపోయాయి. సుమారు 2కి.మీల మేర మంటలు వ్యాపించాయి. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

చంద్రబాబు ఆరా

అగ్నిప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Huge fire accident held in badvel, in Kadapa district on Thursday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి