Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీనేతల ఇళ్ళలో భారీగా పెట్రోల్ బాంబులు, నాటుబాంబులు; పల్నాడులో బాంబుల కలకలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల పోలింగ్ రావణ కాష్టాన్ని తలపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలు అన్ని ఇన్ని కావు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు, ప్రతిదాడులు, ఘర్షణలతో రక్తపుటేరులు పారాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతం దాడులతో అట్టుడికింది.

పిన్నెల్లి గ్రామంలో నివురుగప్పిన నిప్పులా పరిస్థితి
పల్నాడు జిల్లా పిన్నెల్లిలో ఇప్పటికీ టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య గొడవలు చల్లారలేదు. అక్కడ 144సెక్షన్ విధించినప్పటికీ పరిస్థితులు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో పరిస్థితి ఇంకా నివురు గప్పిన నిప్పులా ఉంది. ఈ ఎన్నికలలో పోలింగ్ సందర్భంగా పోలీసులు అదనపుబలగాలను మోహరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు తీసుకున్నప్పటికీ, పోలింగ్ ముగిసిన తర్వాత ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.

huge number of petrol bombs and land bombs were found in YCP leaders houses in Palnadu

వైసీపీ నేతల ఇళ్ళలో పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు
అయితే ఇరు పార్టీ నేతల ఫిర్యాదులతో అసలు గొడవలకు కారణమైన నాయకులను అరెస్టు చేయడానికి పిన్నెల్లి గ్రామంలో నేడు పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో వైసిపి నేతల ఇళ్లల్లో పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు పెద్ద సంఖ్యలో బయటపడటంతో పోలీసులు సైతం షాక్ కు గురయ్యారు. ఈ బాంబులను పోలింగ్ రోజు ఉపయోగించి ఉంటే గ్రామంలో భారీ విధ్వంసం జరిగేదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

పిన్నెల్లి అత్యంత సమస్యాత్మక ప్రాంతం.. అక్కడ దాడులు మామూలే
పల్నాడులోని మాచవరం మండలంలో ఉన్న పిన్నెల్లి గ్రామం అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతమని ఎన్నికల అధికారులు పేర్కొని అక్కడ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల తర్వాత వైసిపి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గ్రామంలో పెరిగిన గొడవలు కక్షలకు కారణం అయ్యాయి. వైసీపీ టిడిపి నేతల మధ్య తరచూ ఘర్షణలు, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం వంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి.

గ్రామాల నుండి వెళ్ళిపోయిన టీడీపీ నేతలు, కోర్టు చొరవతో మళ్ళీ గ్రామాలకు రాక
టిడిపి నేతల పైన దాడులు పెరగడంతో పోలీసులు కూడా వారికి రక్షణ కల్పించలేకపోవడంతో అనేకమంది టీడీపీ నేతలు పిన్నెల్లి గ్రామంలో నివసించలేక హైదరాబాద్, గుంటూరు వంటి ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో పోలీసులు వీరికి రక్షణ కల్పించిన తర్వాత టిడిపి నేతలు మళ్లీ తిరిగి గ్రామానికి వచ్చారు.

బాంబులను గుర్తించి కేసులు నమోదు చేసిన పోలీసులు
2019 ఎన్నికల తర్వాత నుండి రగిలిపోతున్న పిన్నెల్లి ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో రావణ కాష్టాన్ని తలపించింది. ఒకరిపై ఒకరు దాడులు, ప్రతి దాడులు చేసుకోవడంతో తనిఖీలు జరిపిన పోలీసులు వైసీపీ నేతలు ఇళ్లల్లో ఉన్న బాంబులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు వారి పైన కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+