"జగన్ కోసం సిద్ధం" కార్యక్రమానికి భారీ స్పందన-41 లక్షలు దాటిన స్టార్ క్యాంపెయినర్లు..!

ఏపీలో సంక్షేమ పథకాల లబ్దిదారుల్ని స్టార్ క్యాంపెయినర్లుగా మార్చుకుంటూ వైసీపీ చేపట్టిన జగన్ కోసం సిద్దం కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. రాష్ట్రంలో ఇలా పథకాల లబ్ది పొంది ఇప్పుడు తిరిగి వైసీపీ కోసం ప్రచారం చేసేందుకు 41 లక్షల మందికి పైగా స్టార్ క్యాంపెయినర్లు తన పేర్లు నమోదు చేయించుకున్నారు. ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ రోజురోజుకీ ఈ సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో జనంలోనూ జగన్ కోసం సిద్ధం కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది.

huge response for ysrcp s jagan kosam siddham campaign 41lakh voluntary campaigners registered

సీఎం జగన్ ప్రకటించిన సామాన్యులే నా స్టార్ క్యాపెయినర్లు అన్న పిలుపుకి స్పందించి స్వచ్ఛందంగా 41 లక్షల మందికి పైగా వైఎస్సార్సీపీ స్టార్ క్యాంపెయినర్లుగా నమోదు చేసుకున్నారు. ఇందులోనూ అమలాపురం, రాజమండ్రి, హిందూపురం నియోజకవర్గాల నుంచి ఆత్యధికంగా స్టార్ క్యాంపెయినర్లుగాా నమోదు చేసుకున్నారు. వీరంతా నాలుగో రోజు జగన్ కోసం సిద్దం కార్యక్రమాల్లో పాల్గొన్నారని పార్టీ ప్రకటించింది.

huge response for ysrcp s jagan kosam siddham campaign 41lakh voluntary campaigners registered

నవరత్నాల లబ్దిదారులు సీఎం జగన్‌కు తమ మద్దతు తెలియజేస్తూ ఇలా లక్షల సంఖ్యలో స్టార్ క్యాంపెయినర్లుగా నమోదు చేసుకుంటుండటం ఎన్నికల వేళ అధికార పార్టీలో జోష్ నింపుతోంది. స్టార్ క్యాంపెయినర్లుగా నమోదు అనంతరం వీరంతా మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో లంచాలు, వివక్ష లేని సంక్షేమ పథకాల వల్ల తమ కుటుంబాలకు లబ్ది చేకూరిందని అందుకే సీఎం జగన్ కు మద్దతు తెలుపుతున్నట్లు చెప్తున్నారు.

huge response for ysrcp s jagan kosam siddham campaign 41lakh voluntary campaigners registered

ఆంద్రప్రదేశ్ భవిష్యత్తు కోసం సీఎం జగన్ విజన్ నవరత్నాలు ప్లస్‌ను ప్రజల్లోకి చేరువ చేసేందుకు గడప గడపకు కార్యక్రమంతో స్థానికులతో మమేకమై మేనిఫెస్టోని వారికి వివరించేందుకు 47వేల బూత్ లలో 2.5 లక్షలు మంది కార్యకర్తలు ఇప్పటికే పనిచేస్తున్నారు. దీనికి అదనంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 41 లక్షల మందికి పైగా స్టార్ క్యాంపెయినర్లు తమ పేర్లు నమోదు చేసుకుని ప్రచార బరిలోకి దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+