పెళ్లికళ వచ్చేస్తోంది! 24 నుంచి భారీగా, ఆ ఒక్కరోజే వేలాది పెళ్లిళ్లు, మే 13 వరకే, ఆపై అధిక మాసం
Recommended Video

అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెళ్లి సందడి మొదలవనుంది. సంబంధాలు కుదుర్చుకుని మంచి ముహూర్తాలు లేక పెళ్లిళ్లు చేసుకోలేకపోయిన వేలాది మంది వధూవరులు ఇక వేదమంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటవనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలలుగా బాజాభజంత్రీల సందడే లేదు. మాఘ మాసం వచ్చినా.. నవంబరు నెలాఖరునుంచే మూఢం ప్రారంభం కావడం ఇందుకు కారణం. ఫిబ్రవరి 19 నుంచి మూఢం వీడనుంది.. దీంతో మళ్లీ బాజాభజంత్రీలు మోగనున్నాయి.

ఈ నెల చివరి వారం నుంచే...
2017 అక్టోబరు నెల తరువాత పెద్దగా పెళ్లిళ్లు జరగలేదు. వరుసగా గురు, శుక్రమౌఢ్యాల రావడమే ఇందుకు కారణం. మధ్యలో రెండు మూడు మినహా మంచి ముహూర్తాలే లేకుండా పోయాయి. శుక్రమౌఢ్యమి కూడా ఈనెల 19తో ముగుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లిసందడి మొదలుకానుంది. ఫిబ్రవరి చివరి వారం నుంచి మే 13 వరకు శుభ ముహూర్తాలు ఉండడతో రెండు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి.

శుక్రమౌఢ్యమి ప్రారంభం కావడంతో...
నిజానికి వివాహాలకు శ్రేష్టమైనది మాఘమాసం. విదేశాల్లో ఉండే వారికి డిసెంబరు నెలలోనే ఎక్కువ సెలవులు ఉంటాయి కాబట్టి సహజంగా ఈ నెలలోనే అధిక సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. కానీ గత ఏడాది నవంబరు నెల చివరి నుంచే శుక్రమౌఢ్యమి ప్రారంభం కావడంతో మాఘమాసం వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా పెళ్లి బాజాలు మోగలేదు.

ఫిబ్రవరి 24 నుంచి మే 13 వరకు శుభముహూర్తాలు...
శుక్రమౌఢ్యమి ఫిబ్రవరి 19తో ముగుస్తుండడంతో ఇక తెలుగు రాష్ట్రాల ప్రజల ఇళ్లల్లో పెళ్లి సందడి మొదలవనుంది. ఫిబ్రవరి 24, 25, 26 తేదీలలో మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయి. దీంతో ఆ రోజుల్లో అధిక సంఖ్యలో వివాహాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 13 వరుకు శుభ ముహూర్తాలు ఉండడంతో ఇప్పటికే పెళ్లి ఖాయమైన వారు ఈ ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకుని మే 13లోగా మంచి ముహూర్తం చూసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

లక్షా 35 వేలకుపైగా వివాహాలు...
ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు లక్షా 35 వేలకుపైగా వివాహాలు జరుగుతాయని అంచనా. ఒక్క హైదరాబాద్‌లోనే 75 వేలకుపైగా పెళ్లిళ్లు జరగనున్నాయని, ఇక మిగిలిన 9 జిల్లాల్లో జస్ట్ 10 రోజుల్లోనే దాదాపు 60 వేలకుపైగా వివాహాలు జరుగబోతున్నాయట.

మార్చి 4న వేలాది పెళ్లిళ్లు...
డిసెంబరు, జనవరి నెలల్లో నిశ్చితార్థం చేసుకుని మౌఢ్యం కారణంగా మంచి ముహూర్తం కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఒక్క ఒక్క కృష్ణా జిల్లాలోనే 25-30 వేల వరకు వివాహాలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి 4న బ్రహ్మాండమైన ముహూర్తం ఉండడంతో ఆ ఒక్క రోజే తెలుగు రాష్ట్రాల్లో వేలాది పెళ్లిళ్లు జరగనున్నట్లు సమాచారం.

ముస్తాబవనున్న ఫంక్షన్‌హాళ్లు...
మౌఢ్యమి కారణంగా మాఘమాసంలో బోసిపోయిన ఫంక్షన్ హాళ్లు ఇక పెళ్లిళ్లకు ముస్తాబు కాన్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో, మార్చి ప్రారంభంలో పెళ్లిళ్లు ఉండటంతో పురోహితులు, పూల అంకరణ, వంటవారు, ఫొటో, వీడియోగ్రాఫర్లు కూడా బిజీగా మారనున్నారు. ఉగాది వెళ్లాక చైత్ర, వైశాఖ మాసాల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి.

మేలో మళ్లీ అధిక జ్యేష్ఠమాసం...
మేలో మళ్లీ అధిక జ్యేష్ఠమాసం వస్తుంది కాబట్టి ఈలోగా పెళ్లిళ్లు చేసుకునేందుకు భారీగా సిద్ధమవుతున్నారు. చైత్ర, వైశాఖ మాసాలతో పాటు జ్యేష్ఠ మాసంలోనూ పెళ్లిళ్లు జరుగుతాయి. అయితే అధికమాసంలో వివాహాది శుభకార్యాలు చేయకూదు కాబట్టి మే 13 లోపే శుభకార్యాలన్నీ జరుపుకోవాలి. లేని పక్షంలో శ్రావణం వరకు ఆగాల్సి ఉంటుంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications