అనూహ్య మలుపు, ఎన్డీఏలోకి వైసీపీకి ఆహ్వానం - జగన్ కీలక నిర్ణయం..!!

ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో సుదీర్ఘ భేటీతో అనేక ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో కలిసి ఏపీలో జగన్ పైన పోరాటం చేయాలని భావించాయి. ఈ మేరకు ప్రయత్నాలు చేసాయి.

కానీ, జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణాల్లో ఎన్డీఏలోకి మరోసారి వైసీపీకి ఆహ్వానం అందింది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో నే ఈ ఆహ్వానం పైన తన నిర్ణయం స్పష్టం చేసారు. అదే సమయంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Huge twist: YSRCP invited to join NDA alliance, Here is CM Jagans decision

కీలక అంశాలపై చర్చలు : ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో కీలక అంశాల పైన చర్చలు జరిగాయి. ఈ నెల 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే కేంద్రం రెండు కీలక బిల్లుల ను ప్రవేశ పెట్టేందుకు నిర్ణయించింది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వ ముఖ్యులు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసారు.

తాజాగా తనను కలిసిన ముఖ్యమంత్రి జగన్ ను ఇదే అంశం పైన ప్రస్తావించారు. ఈ విషయంలో ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లు, నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీ బిల్లు సమయంలో బీజేపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ప్ర‌ధాని కోర‌గా, వైఎస్ జ‌గ‌న్ దానికి అంగీక‌రించిన‌ట్లు చెబుతున్నారు.

ప్రధాని నుంచి హామీ : కేంద్రంతో స‌యోధ్య‌తో వ్య‌వ‌హ‌రిస్తూనే ఏపీ సీఎం జ‌గ‌న్ రాష్ట్రానికి రావాల్సిన బ‌కాయిల‌న్నీ రాబ‌ట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్ప‌టికే పోల‌వ‌రం ప్రాజెక్టుతో స‌హా కేంద్రం నుంచి రావాల్సిన వివిధ బ‌కాయిల కింద సుమారు 21వేల కోట్ల రూపాయ‌ల నిధుల‌ను రాబట్టిన ఏపీ సీఎం... తాజా స‌మావేశంలో మ‌రిన్ని నిధుల కోసం అభ్య‌ర్థించారు. గ‌త నాలుగు సంవ‌త్స‌రాల్లో ఎప్పుడూ లేనంత‌గా జ‌గ‌న్‌-మోడీలు సుమారు 90 నిముషాల పాటు స‌మావేశ‌మై సుదీర్ఘంగా చ‌ర్చించారు.

ఆర్థిక ఇక్క‌ట్ల‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీని ప్ర‌క‌టించాల‌ని, పోల‌వ‌రం ప్రాజెక్టు పున‌రావాసం కింద మ‌రో 10 వేల కోట్ల నిధులు విడుద‌ల చేయాల‌ని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌ధానిని అభ్య‌ర్థించిన‌ట్లు తెలుస్తోంది. దీనికి మోడీ కూడా సానుకూలంగా స్పందించిన‌ట్లు చెబుతున్నారు. వారంలోగా ఈ నిధులు రావ‌చ్చ‌ని తెలుస్తోంది. పార్లమెంట్ లో ప్రభుత్వానికి వైసీపీ మద్దతు కీలకంగా మారుతోంది.

Huge twist: YSRCP invited to join NDA alliance, Here is CM Jagans decision

ఎన్డీఏలోకి ఆహ్వానం..నో : ఈ నేప‌థ్యంలో మోడీ ఎప్ప‌టినుంచో అమ‌లు చేయాల‌నుకుంటున్న యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును ఎలాగైనా గ‌ట్టెక్కించాల‌నుకుంటున్నారు. దేశ ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు ఫోన్ నంబ‌ర్ ఇచ్చి మిస్‌డ్ కాల్ ద్వారా మ‌ద్ద‌తు తెలిపాల‌ని కూడా నిర్ణ‌యించారు. ఈ రెండు బిల్లులు ఆమోదం పొందాలంటే రాజ్యసభలో వైసీపీ మద్దతు బీజేపీకి చాలా అవసరం. ఎన్డీయేతర పార్టీల నుంచి బీజేపీకి జగన్ నమ్మకమైన స్నేహితుడుగా మారారు.

ఇంత‌కుముందు బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన కీల‌క‌మైన బిల్లుల స‌మ‌యంలో సైతం వైసీపీ మ‌ద్ద‌తు ల‌భించింది. అందుకే ఎన్డీఏలోకి రావాల‌ని కూడా జగన్‌ను మోడీ కోరిన‌ట్లు తెలుస్తోంది. ఎన్డీఏలో చేరే అవకాశం లేదని జగన చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్డీయే ప్రభుత్వానికి జ‌గ‌న్‌ బయటి నుంచి మద్దతు ఇస్తున్నారు. ఇక ముందు కూడా త‌న స‌హ‌కారం ఇలాగే ఉంటుంద‌ని జ‌గ‌న్ మోడీకి స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+