వ్యభిచార గృహాలకు ఎక్స్‌ప్రెస్ రైల్లో 20మంది యువతుల తరలింపు
కడప: వివిధ ప్రాంతాల నుంచి తీసుకు వచ్చిన అమ్మాయిలను వ్యభిచార గృహాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను కడప పోలీసులు శుక్రవారం నాడు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లో 20 మంది యువతులను ఓ ముఠా తరలిస్తోందనే సమాచారం వచ్చింది.
దీంతో రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు కలిసి దాడులు చేశారు. ఈ రైలులో ఇరవై మంది యువతులను పోలీసులు కాపాడారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. యువతులను రెస్క్యూ హోంకు తరలించారు.

ప్రసాదాల దళారీ అరెస్టు
శ్రీవారి ప్రసాదాలు, రుద్రాక్షలు మీ ఇంటికే పంపిస్తానని మోసగిస్తున్న ఆన్‌లైన్ మోసగాడిని తిరుపతి పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాలకు చెందిన ప్రసాదాలను, రుద్రాక్షలను, జాతిరాళ్లను గడపముందుకే చేరుస్తామని, భక్తులు కోరితే వారిపేరుతో సంబంధిత దేవాలయాల్లో అవసరమైన పూజలు జరిపిస్తామని, అలాగే వసతి రవాణా సౌకర్యాలు కల్పిస్తామని వెబ్ సైట్‌ను ప్రారంభించి వ్యాపారం చేస్తున్న ధనశేఖర్ రెడ్డి(30) అనే మోసగాడిని తిరుపతి ఈస్ట్ పోలీసుల అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications