ఏపీలో బరిలో పందెం కోళ్ళు.. భారీ బెట్టింగులు, వందల కోట్లు కొక్కరకో!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సందర్భంగా కోడి పందాల హడావిడి కొనసాగుతుంది. ఎక్కడ చూసినా కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో మాత్రమే కాకుండా కృష్ణాజిల్లాలోనూ కోడిపందాలు చాలా చోట్ల కొనసాగుతున్నాయి. కోళ్ళ కాళ్ళకు కత్తులు కట్టి పందాలు కట్టకూడదని, ఎంత హెచ్చరించినా, హెచ్చరికలను తుంగలో తొక్కి కోళ్ళ సమరం రక్తపాతాన్ని సృష్టిస్తుంది.

ఏపీలో పందెం కోళ్ళ హవా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కోడిపందాలలో పాల్గొనేందుకు హైదరాబాద్ తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ వంటి అనేక ప్రాంతాల నుండి పందెం రాయుళ్లు గత రెండు రోజుల నుంచి ఏపీలోనే మకాం వేశారు. ముఖ్యంగా ఏలూరు జిల్లా దెందులూరు లోనూ , పెదపాడు, పెదవేగి, కైకలూరు, ఉంగుటూరు మండలాలతో పాటు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, పెద అమిరం, ఉండి, ఆకివీడు ప్రాంతాలలో పందెం రాయుళ్ళు జోరుగా పందాలు కడుతున్నారు.

hundred crores bettings in ap over cockfights in two days

వందల కోట్ల బెట్టింగులు
కోడిపందాలతో పాటు బరుల వద్ద భారీగా పేకాట, గుండాట, కోత ముక్క శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండగ కోడిపందాలలో వందల కోట్లు చేతులు మారినట్లు సమాచారం. ఒక్క కృష్ణా జిల్లాలోనే రెండు రోజుల్లో వంద కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో భారీగా కోడి పందాలు కట్టటంతో వందల కోట్ల మేర బెట్టింగ్‌లు జరుగుతున్నాయని సమాచారం.

ఆటకు కోటి.. డబ్బు లెక్కించేందుకు కౌంటింగ్ మెషీన్లు
కొన్ని చోట్ల ఆటకు కోటి రూపాయల బెట్టింగ్ కూడా వేసి రసవత్తరంగా పందాలను సాగిస్తున్నారు. నిన్న ఒక్కరోజే భీమవరంలో 150 కోట్ల బెట్టింగ్ నడిచింది. ఈరోజు కనుమ.. నేడు మరింతగా పందెంరాయుళ్లు రెచ్చిపోతారన్న అంచనాలు ఉన్నాయి.. కరెన్సీని లెక్కపెట్టేందుకు మనీ కౌంటింగ్ మిషన్లు కూడా తెచ్చి, సకల సౌకర్యాలతో అక్కడ భారీగా ఏర్పాట్లు చేశారు.

మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఫుడ్, లిక్కర్ బిజినెస్
అంతేకాదు కోడిపందాలు నిర్వహించే చోట యాంకర్ లను కూడా పెట్టి యాంకరింగ్ చేయిస్తున్నారు అంటే కోడిపందాల జోరు ఎలా ఉంటుందో అర్ధం అవుతుంది. ఇక కోడి పందాలు నిర్వహించే చోట మద్యం ఏరులై పారుతుంది. బరిలో పోరాడి చనిపోయిన కోళ్ళను వండి వడ్డిస్తున్నారు. తిన్న వారికి తిన్నంత, తాగినోళ్ళకి తాగినంత అన్న చందంగా పరిస్థితి ఉంది. ఫుడ్ మరియు లిక్కర్ బిజినెస్ ఈ మూడు రోజులు మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్టు సాగుతుంది.

కోడి పందాల పేరుతో వందల కోట్లు కొక్కరకో
ఇక భారీగా నిర్వహించే కోడి పందాలు చూడాలంటే కచ్చితంగా ఎంట్రీ పాస్ లు ఉండాలి. పాస్ లు లేనివారికి లోనికి ఎంట్రీ కష్టమే. ఈసారి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో అధికార పార్టీ కనుసన్నలలో ఈసారి కోడిపందాలు జరుగుతున్నట్టు సమాచారం. వందల కోట్ల రూపాయలు కోడి పందాల పేరుతో కొక్కరకో అనిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+