వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారాహి ఏపీ ఎంట్రీ కష్టమేనా? మంత్రుల హెచ్చరికలు ! ఇక్కడ రూల్స్ ఒప్పుకోవట !

|
Google Oneindia TeluguNews

ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి బలీయశక్తిగా మారేందుకు ప్రయత్నిస్తున్న జనసేన పార్టీ ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ తయారు చేయించుకున్న సొంత వాహనం వారాహికి మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికే ఈ వాహనం రంగుపై ఏపీలో వైసీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో పవన్ ఈ వాహనాన్ని రిజిస్టర్ చేయించుకున్నారు. అయినా వారాహికి ఏపీలో ఎంట్రీ ఇవ్వకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

వారాహి ఏపీ ఎంట్రీ ఇస్తుందా?

వారాహి ఏపీ ఎంట్రీ ఇస్తుందా?

పవన్ కళ్యాణ్ జనసేన ప్రచారం కోసం తయారు చేయించుకున్న అత్యాధునిక వారాహి వాహనం ఇప్పుడు ఏపీలో ఎంట్రీ ఇస్తుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. వారాహి రంగుపై ఏపీలో వైసీపీ నేతల అభ్యంతరాల నేపథ్యంలో తెలంగాణలోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న ఈ వాహనాన్ని ఏపీలో ఎంట్రీ ఇవ్వకుండా చేసేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా అనుసరించాల్సిన వ్యూహాన్ని ప్రభుత్వం రూపొందించే పనిలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. వారాహి వాహనం అసలు లక్ష్యం ఏపీయే కావడంతో ఇక్కడ దానిపై ప్రభుత్వం లేవనెత్తే అభ్యంతరాలు కీలకంగా మారబోతున్నాయి.

పేర్నినానితో మొదలు

పేర్నినానితో మొదలు

పవన్ కళ్యాణ్ భారీ స్ధాయిలో తయారు చేయించుకున్న వారాహి వాహనం నిజంగానే ఇతర పార్టీల అధినేతల మతి పోగొట్టేలా ఉంది. దీంతో వారాహి ఫొటోలు బయటికి రాగానే ప్రెస్ మీట్ పెట్టిన వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని దీనిపై విమర్శలకు దిగారు. ముఖ్యంగా వారాహి వాహనం రంగుపై ఆయన అభ్యంతరాలు లేవనెత్తారు. మిలటరీ వాహనాలకు మాత్రమే వాడే అవకాశం ఉన్న ఆలివ్ గ్రీన్ రంగును వారాహికి ఎలా వాడతారంటూ ప్రశ్నించారు.

ఈ రంగుతో అయితే రిజిస్ట్రేషన్ కాదని కూడా తేల్చిచెప్పేశారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండానే దీని రిజిస్ట్రేషన్ పూర్తి చేయించుకున్నారు. దీనిపై వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు.

వైసీపీ మంత్రి అమర్నాథ్ హెచ్చరికలు

వైసీపీ మంత్రి అమర్నాథ్ హెచ్చరికలు

వైసీపీ నేతల అభ్యంతరాల నేపథ్యంలో తెలంగాణలో వారాహి వాహనం రిజిస్ట్రేషన్ పూర్తి చేయించుకోవడంతో దీనిపై స్పందించిన వైసీపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్.. వాహనం ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని, కానీ ఎక్కడ తిరుగుతోందన్నది ముఖ్యమన్నారు. అమెరికాలో అయినా వాహనం తీసుకోవచ్చని, కానీ తిరిగే చోట అమలయ్యే నిబంధనలే దానికీ వర్తిస్తాయన్నారు.

తద్వారా పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి తాము అభ్యంతరాలు చెప్పడం ఖాయమన్న విషయాన్ని మంత్రి గారు చెప్పకనే చెప్పేశారు. ముఖ్యంగా రంగు విషయంలో ఆర్మీ నిబంధనల్ని అడ్డుపెట్టి వారాహిని ఏపీలో ఎంట్రీ కాకుండా అడ్డుకుంటారా అన్న ప్రశ్నలు దీంతో తలెత్తుతున్నాయి.

ఏపీలో వారాహిని అడ్డుకుంటే?

ఏపీలో వారాహిని అడ్డుకుంటే?

వారాహి విషయంలో వైసీపీ నేతలు, మంత్రుల అభ్యంతరాలను నిశితంగా గమనిస్తున్న పవన్ కళ్యాణ్.. ఒకవేళ ఏపీలోకి తన వాహనం రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటే అప్పుడు తీసుకోవాల్సిన చర్యలపైనా నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నేతల అభ్యంతరాల నేపథ్యంలోనే తెలంగాణలో వారాహి రిజిస్ట్రేషన్ చేయించుకున్న పవన్ ... ఇప్పుడు ప్రభుత్వం అభ్యంతరాలు చెబితే కోర్టుల్లో పిటిషన్ వేసి అయినా పంతం నెగ్గించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే వకీల్ సాబ్ సినిమా సమయంలో తలెత్తిన పరిణామాలు మరోసారి రిపీట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

English summary
even after completing registration in telangana, pawan kalyan's varahi vehicle is seems to face hurdles for ap entry as ysrcp ministers issued warnings against this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X