భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడని వ్యక్తి చేతులు నరికిన భర్త

హైదరాబాద్: విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని ఎస్. కోట్ మండలంలో ఆదివారం ఆర్‌సీఎం స్కూలు వద్ద తన భార్యను దూషించాడని ఓ వ్యక్తి చేతులు నరికేశాడు ఆ భర్త. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఎస్. కోటకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన భార్య ఆదివారం నాడు ఆర్‌సీఎం స్కూల్లో ఓపెన్ స్కూలు పరీక్షలు రాస్తుంది. ఆమెతో పాటు ఎస్. కోటకు చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి పరీక్షలు రాస్తూ శ్రీనివాసరావు భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

husband cuts a man hands by scolding of his wife

పరీక్ష అనంతరం ఆమె తన భర్తకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహించిన శ్రీనివాసరావు, ఇబ్రహీంపై కత్తితో దాడి చేసి చేతులు నరికాడు. దీంతో దాడిలో తీవ్రంగా గాయపడిన ఇబ్రహీంను విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించారు.

స్ధానికులు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్ధలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డ దంపతులు

ఆర్ధిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా, సింగరాయకొండలో జరిగింది. సింగరకొండ ఆలయ ప్రాంగణంలోని శ్రీ మారుతి భవన్‌లో గది అద్దెకు తీసుకున్న దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతులను మార్టూరు మండలం, బొబ్బేపల్లి వాసులుగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+