AP News: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కత్తులతో కడతేర్చాడు..
ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. మన కులాలు వేరు.. పెళ్లవ్వడం కష్టమని చెప్పింది. అయినా ఫర్వాలేదు.. తమ ఇంట్లో వారిని ఒప్పిస్తానని చెప్పాడు. చివరికి ఆమె అతడి ప్రేమను ఒప్పుకుంది. తర్వాత పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులను విడిచి వచ్చిన ఆ యువతికి అతను చుక్కలు చూపించాడు. అతడి వదిలి వెళ్లిపోయిన విడిచి పెట్టాలేదు. చివరికి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో జరిగింది.
కూర్మన్నపాలెంనకు చెందిన గిరిజన యువతి మహాలక్ష్మి సచివాలయంలో వ్యవసాయ సహాయకురాలిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను ప్రేమిస్తున్నానంటూ గాజువాకకు చెంది శ్రీనివాస్ వెంటపడ్డాడు. చివరికి అతని ప్రేమను మహాలక్ష్మి ఒప్పుకుంది. దీంతో వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. అత్తారింటికి వెళ్లిన మహాలక్ష్మి అత్త, భర్త వేధింపులు మొదలయ్యాయి. కులం పేరుతో దూషించడం.. కొట్టడం చేసేవారు. కొన్నాళ్లు వేధింపులు భరించిన మహాలక్ష్మి చివరికి పుట్టింటికి వెళ్లిపోయింది.

అయినా వేధింపులు ఆగకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహాలక్ష్మి పని చేస్తున్న చోట శ్రీనివాస్ తప్పుడు ఫిర్యాదులు చేసి ఇబ్బంది పెట్టేవాడు. దీంతో మహాలక్ష్మి విడాకులు కోరింది. శ్రీనివాస్ మహాలక్ష్మిపై పగ పెంచుకుని హత్యకు ప్లాన్ చేశాడు. అందుకు రెండు కత్తులు కూడా కొనుగోలు చేశాడు. మే 29న మహాలక్ష్మి ఫోన్ చేసి తాను మారిపోయినట్లు చెప్పాడు. వెంటనే తన వద్దకు రావాలని కోరాడు.
ఇది నమ్మిన మహాలక్ష్మి అచ్యుతాపురం లాడ్జీలో ఉన్న భర్త శ్రీనివాస్ వద్దకు వెళ్లింది. మహాలక్ష్మికి స్వాగతం పలికిన అతను నీ కోసం భోజనం తెప్పించా.. తిను అని ఆమె పెట్టాడు. భోజనంలో మత్తు మందు కలపడంతో మహాలక్ష్మి మత్తులోకి జారుకుంది. శ్రీనివాస్ వెంటనే రెండు కత్తులతో మహాలక్ష్మి ఒంటిపై ఇష్టానుసారం పొడిచాడు. దాదాపు 36 పోట్లు పొడిచాడు. దీంతో మహాలక్ష్మి శరీరానికి 16 చోట్లు లోతైన గాయాలు, 20 చోట్ల స్వల్ప గాయాలయ్యాయి.
రూమ్ నుంచి శబ్దాలు రావడంతో లాడ్జీ సిబ్బంది పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసారికి మహాలక్ష్మి మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు పరారీ కాగా అతన్ని పోలీసులు పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications