వివాహేతర సంబంధం: భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపిన భర్త
అమరావతి: భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న భర్త ఆమెను, ప్రియుడిని అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం కదిరినాయినికోట గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం కదిరినాయినికోట గ్రామానికి చెందిన దంపతులు వెంకటరమణ, అరుణ(32) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన ఆదినారాయణ(39) కూడా కూలి పనులకు వెళ్తుంటాడు. ఈక్రమంలో ఆదినారాయణ, అరుణతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ఈ వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న వెంకటరమణ పలుమార్లు భార్యను హెచ్చరించినా తన తీరు మార్చుకోకపోవడంతో.. గత కొన్ని రోజులుగా ఆమెతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం భర్త ఇంట్లో లేని విషయాన్ని గుర్తించిన అరుణ తన ప్రియుడు ఆదినారాయణను కలవడానికి వెళ్లింది.

ఈ విషయం తెలుసుకున్న వెంకటరమణ వేట కొడవలిని తన వెంట తీసుకొని వాళ్లను అనుసరిస్తూ వెళ్లాడు. ఈ క్రమంలో వాళ్ళిద్దరూ అత్యంత సన్నిహితంగా ఉన్న సమయంలో చూసి తట్టుకోలేక వేట కొడవలితో భార్య మెడ మీద వేటు వేయడంతో అరుణ అక్కడికక్కడే మృతి చెందింది.
ఇదే సమయంలో అక్కడి నుంచి పారిపోయిన ఆదినారాయణను వెంటాడి మరీ నడి రోడ్డుపై వేట కొడవలితో అత్యంత దారుణంగా నరికి చంపాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications