ప్రియుడి మోజులో పడి, మద్యం తాగించి భర్తను హత్య చేసిన భార్య

ప్రియుడి మోజులో పడి భర్తను హత్యచేసింది ఓ భార్య, మద్యం తాగించి మరీ ఆమె భర్తను హత్య చేసింది. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకొంది. భర్త ను హత్య చేసిన భార్యను ఆమెకు సహకరిచిన ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.

విజయవాడ:ప్రియుడి కోసం భర్తను హత్య చేసింది భార్య, ప్రియురాలిని మందలించినా కాని ఆమె మారలేదు. ప్రియుడితో కలవడానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని వారిని బంధువుల ఇంట్లో వదిలి మరీ ఆమె ప్రియుడితో తన సంబంధాలను కొనసాగించింది. చివరకు భర్తకు మద్యం తాగించి మరీ హత్య చేసింది. ఈ ఘటన విజయవాడలో జరిగింది.

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో పైపులైన్ల రోడ్డుకు చెందిన నిల్లా దుర్గాప్రసాద్ బంగారం షాపు నిర్వహించేవాడు. పై అంతస్తులో భార్య మల్లిక, పిల్లలతో నివాసం ఉండేవాడు. కింద తన బంగారం షాపు నిర్వహించుకొనేవాడు.

దుర్గాప్రసాద్ కు తొమ్మిదేళ్ళ క్రితం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన మల్లికతో వివాహం జరిగింది.వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఓ పాప, బాబు . దుర్గాప్రసాద్ వద్ద అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీకి చెందిన మజ్జి సింహచలం పనిచేస్తున్నాడు. 13 ఏళ్ళుగా ఆయన దుర్గాప్రసాద్ వద్దే పనిచేస్తున్నాడు.

husband murderd by wife in vijayawada

సింహచలం ఇంట్లో మనిషిగా దుర్గాప్రసాద్ భావించేవాడు. సింహచలంపై మల్లిక ప్రేమను పెంచుకొంది. దీంతో దుర్గాప్రసాద్ ఇంట్లో లేని సమయంలో సింహచలం మల్లికతో చనువుగా ఉండేవాడు. అయితే ఈవిషయాన్ని గమనించిన పిల్లలు దుర్గాప్రసాద్ కు చెప్పారు.

దీంతో దుర్గాప్రసాద్ పై అంతస్థులోకి వెళ్ళే మార్గంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేశాడు. సిసి కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను చూసిన దుర్గాప్రసాద్ మల్లికను కొట్టాడు. దీంతో ఆమె భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్ళిపోయింది.

కుమారుడిని తల్లిదండ్రుల వద్ద వదిలేసింది. తిరిగి విజయవాడకు వచ్చింది. తర్వాత కుమార్తెను తన మామ వద్ద ఉంచింది. దీంతో పిల్లల నిఘా తనపై లేకుండా చేసుకొంది.

అయితే ప్రియుడితో సంబంధాలు కొనసాగించేందుకు భర్త అడ్డుగా ఉంటాడని భావించిన ఆమె ఆయన అడ్డు తొలగించుకోవాలని భావించింది.ఈ విషయమై ప్రియుడు సింహచలంతో చర్చించింది. కిరాయి రౌడీలతో చంపించాలని భావించారు.అయితే అది కుదరలేదు. దీంతో ఆమె తానే చంపాలని నిర్ణయించుకొంది.

గత ఏడాది నవంబర్ 15వ, తేదిన భర్తకు బలవంతంగా ఆమె మద్యం తాగించింది.నిజానికి దుర్గాప్రసాద్ కు మద్యం తాగే అలవాటు లేదు. దుర్గాప్రాసద్ మత్తులోకి జారుకొన్న తర్వాత సింహచలం ఇంటికి వచ్చాడు. దుర్గాప్రసాద్ ను సింహచలం పచ్చడి బండతో బలంగా కొట్టాడు.అర్థరాత్రి పూట ఆటోలో మృతదేహన్ని తీసుకెళ్ళి గుణదలలోని రైల్వే ట్రాక్ పక్కన పడేశారు.

తన భర్త కన్పించడం లేదని మల్లిక నవంబర్ 17వ, తేదిన పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే తన భర్త వయస్సు 47 గా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పింది.అయితే పోస్టుమార్టమ్ లో వచ్చిన నివేదిక ఆదారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో మల్లికపై పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ అనుమానం ప్రకారంగా ఆమెను అదుపులోకి విచారణ చేస్తే భర్తను హత్య చేసిన విషయం వెలుగుచూసింది. మల్లికతో పాటు ఆమె ప్రియుడు సింహచలాన్ని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+