విచారణలో షాకింగ్: 'నా భార్య రోగి, నాకు సుఖంలేదని యువతితో సంబంధం పెట్టుకున్నా'

Posted By:
Subscribe to Oneindia Telugu

చిత్తూరు: చిత్తూరు జిల్లా నారాయణవనంలో సోమవారం ఉదయం సుజాత అనే మహిళ హత్యకు గురైంది. హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులతో పాటు ఆమె భర్త శివకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.

 పదిహేనేళ్ల క్రితం పెళ్లి

పదిహేనేళ్ల క్రితం పెళ్లి

కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన శివకుమార్‌ అదే ప్రాంతానికి చెందిన సుజాతను పదిహేనేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అక్కడే ఆర్ఎంపీగా విధులు నిర్వహిస్తున్న సమయంలో వైద్యం వికటించి ఒకరు మృతి చెందారు.

భార్యకు వ్యాధి

భార్యకు వ్యాధి

దీంతో బాధితులు దాడి చేయడంతో కుటుంబంతో నారాయణవనం చేరి క్లినిక్‌ ఏర్పాటు చేసుకున్నాడు. క్లినిక్‌లో పని చేయడం కోసం ఓ యువతిని పెట్టుకున్నాడు. అప్పటికే శివకుమార్‌ భార్య సుజాత గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది.

 ఇక్కడ యువతితో వివాహేతర సంబంధం

ఇక్కడ యువతితో వివాహేతర సంబంధం

ఈ నేపథ్యంలో క్లినిక్‌లో పనిచేస్తున్న యువతితో శివకుమార్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని సుజాత తన తల్లిదండ్రులు, సోదరులకు చెప్పడంతో గొడవ జరిగింది. అప్పుడు పెద్దలు సర్దిచెప్పడంతో సద్దుమణిగింది. అయితే నాటి నుంచి భార్యను చంపేయాలని శివకుమార్‌ ప్లాన్ చేస్తున్నాడు.

చంపేయాలని ప్రణాళికలు

చంపేయాలని ప్రణాళికలు

సుజాత తీసుకునే మందులు, మాత్రలతోనే చంపేయాలని తిరుపతిలో డాక్టర్లను కలిశాడు. వారు సహకరించకపోవడంతో తిరుపతిలోని ఆటోనగర్‌లో నివాసముంటున్న అక్క కొడుకును కలిశాడు. రవికుమార్‌ అక్కడే ఉంటున్న మరో ఇద్దరిని కలిపాడు. రూ.50 వేలకు బేరం కుదుర్చుకున్నారు.

 అక్క కొడుకు, మరో ఇద్దరితో కలిసి

అక్క కొడుకు, మరో ఇద్దరితో కలిసి

అక్క కొడుకు, మరో ఇద్దరిని పదిహేను రోజుల ముందు శివకుమార్‌ తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంటి పరిస్థితులను అంచనా వేశారు. సోమవారం ఉదయం అక్క కొడుకుకు ఫోన్‌ చేసిన శివ కుమార్‌ తాను బయటికి వెళుతున్నానని, ప్లాన్ అమలు చేయాలని చెప్పాడు.

తెలిసిన వారేనని తలుపు తీస్తే

తెలిసిన వారేనని తలుపు తీస్తే

శివకుమార్ అక్క కొడుకు, ఇద్దరు ఆటోలో నారాయణవనం వచ్చారు. ఆ ఇద్దరిని శివకుమార్ అక్క కొడుకు ఇంటి వద్ద దించాడు. తాను దూరంగా వెళ్లిపోయాడు. ఆ ఇద్దరు తలుపు తట్టగా సుజాత తలుపులు తెరిచింది. గతంలో ఇంటికి వచ్చిన వారేనని తలుపు తెరిచింది. తాగడానికి నీళ్లు ఇచ్చింది.

సుజాత చేతులు పట్టుకొని, కూతురు లెగ్గిన్‌ మెడకు చుట్టి

సుజాత చేతులు పట్టుకొని, కూతురు లెగ్గిన్‌ మెడకు చుట్టి

ఇద్దరిలో ఒకతను తొలుత సుజాత రెండు చేతులు పట్టుకోగా రెండో వ్యక్తి అక్కడే పడి ఉన్న సుజాత కూతురు లెగ్గిన్‌తో ఆమె మెడకి చుట్టడానికి ప్రయత్నించాడు. సుజాత బిగ్గరగా కేకలు వేయడంతో ఆమెను కిందకు తోసి దిండుతో ఊపిరాడకుండా చేశారు. దీంతో ఆమె మృతి చెందింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Husband reveals why he killed wife in Chittoor district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి