భార్య పుట్టింటికి వెళ్ళి రాలేదని భర్త ఏం చేశాడంటే
గుంటూరు : పుట్టింటికి వెళ్ళిన భార్య తిరిగి రాలేదనే మనస్థాపానికి గురైన ఓ కానిస్టేబుల్ ఆత్మహాత్య చేసుకొన్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది. భార్య భర్తల మద్య చోటుచేసుకొన్న చిన్న గొడవ భర్త ప్రాణల మీదకు తెచ్చింది.
నేలపల్లి మణికంఠ సిఆర్ పిఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఈయనది గుంటూరు జిల్లా దుగ్గిరాల.ఏడాది క్రితం విశాఖ జిల్లా ఆనకాపల్లికి చెందిన శ్రీలలితా పద్మినిదేవితో వివాహం జరిగింది. మణికంఠ చత్తీస్ ఘడ్ లో విధులు నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజులుగా భార్య భర్తల మద్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

అక్టోబర్ 10వ, తేదిన మణికంఠ సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. నవంబర్ 2వ, తేదిన భార్య, భర్తల మద్య గొడవ జరిగింది. ఈ గొడవతో పద్మిని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అదే రోజు సాయంత్రం మణికంఠ భార్య వద్దకు వెళ్ళి ఇంటికి రావాలని కోరాడు. ఆమె నిరాకరించిండి.
రెండు రోజుల పాటు ఆమె పుట్టింటి వస్తోందనే ఆశతో ఆయన ఎదురుచూశాడు. కాని ఆమె రాకపోవడంతో మణికంఠ మనస్థాపానికి గురై నవంబర్ 5వ, తేది సాయంత్రం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.తెనాలి, గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స జరిపినా ఫలితం లేకపోయింది. ఆదివారం తెల్లవారుజామున మణికంఠ చనిపోయాడు.












Click it and Unblock the Notifications